దుబాయ్ రికార్డును దుబాయే.. బుర్జ్ ఖలీఫా కంటే ఎత్తులో మరో భవంతి
posted on: Apr 11, 2016 12:11PM
.jpg)
దుబాయ్ రికార్డును దుబాయే బద్దలు కొట్టే ప్రయత్నాలు చేస్తుంది. ప్రపంచంలో ఎత్తైన భవంతి ఏదంటే టక్కున దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా భవనం గుర్తుకొస్తుంది. ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ ఎమ్మార్ ఎంతో శ్రమించి 2,700 అడుగులు ఉన్న ఈ భవంతిని నిర్మించి ప్రపంచంలో ఎత్తైన భవంతిగా గిన్నిస్ రికార్డులకెక్కింది. ఇప్పుడు అదే సంస్థ తమ రికార్డును తామే బద్దలు కొట్టేందుకు రంగంలోకి దిగింది. 2020 నాటికి బుర్జ్ ఖలీఫాను తలదన్నే రీతిగా మరో భవంతిని నిర్మిస్తామని ఎమ్మార్ చైర్మన్ మొహమద్ అలబ్బార్ చెప్పారు. దాదాపు ఓ మిలియన్ డాలర్ల ఖరీదుతో కట్టనున్న ఈ నిర్మాణం ఎత్తు ఎంత అన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. బుర్జ్ ఖలీఫా కంటే ఎత్తుగా ఉండే ఈ నిర్మాణం ఎత్తు ఎంతన్న విషయాన్ని నిర్మాణాన్ని పూర్తి చేసిన తర్వాత ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.


.jpg)



