వివాహబంధంతొ ఒక్కటైన డీఎస్పీలు

పోలీసు శాఖలో ఒకే క్యాడర్ లో పని చేస్తున్న ఇద్దరు ఉన్నతాధికారులు వివాహబంధంతో ఒక్కటయ్యారు. అవనిగడ్డ డీఎస్పీగా పని చేస్తున్న విద్యశ్రీ, పల్నాడు జిల్లా గురజాల డీఎస్పీగా పని చేస్తున్న జగదీష్ కు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిరువురూ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలను ఒప్పించి ఇప్పుడు వివాహబంధంతో ఒక్కటయ్యారు.

 పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో వీరి వివాహం వైభవంగా జరిగింది. పోలీసు శాఖలో ఒకే క్యాడర్ లో పని చేస్తున్న ఇద్దరు ఉన్నతాధికారులు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడం విశేషంగా మారింది. వీరి ప్రేమ పెళ్లిపై పోలీసు శాఖలోనే కాకుండా సామాన్య ప్రజలలో కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu