Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మద్యం మత్తులో డ్రైవింగ్.. అడ్డుకోబోయిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను బానెట్‌పై ఈడ్చుకెళ్లాడు!
posted on: Mar 2, 2026 10:16AM
.webp)
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి చౌరస్తా వద్ద ఓ లగ్జరీ బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. ఓ యువకుడు ఫుల్‌గా మద్యం సేవించి మితిమీరిన వేగంతో కారు నడుపుతూ ఒక వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను కారు బానెట్‌పై ఈడ్చుకెళ్ళాడు. పోలీసుల కథనం ప్రకారం ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గుర్రంపాటి తరుణ్ అనే యువకుడు ఫుల్ గా మద్యం సేవించి కారు నడుపుతూ రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాడు. అయినా ఆగకుండా అక్కడ నుంచి వెళ్లిపోతుండటంతో.. అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ అతడిని ఆపేందుకు ప్రయత్నించారు. అయినా తరుణ్ కారు ఆపకుండా ముందుకు దూసుకెళ్లాడు. దీంతో ఆ కానిస్టేబుల్ కారు బాయినెట్ పై పడ్డారు.
అలా పడిన కానిస్టేబుల్ తో సహా కారును దాదాపు అరకిలోమీటర్ తీసుకెళ్లిపోయాడు. స్థానికులు అప్రమత్తమై తమ వాహనా లను అడ్డంగా పెట్టడంతో ఆ ర్యాస్ డ్రైవర్ తరుణ్ కారును ఆపకతప్పలేదు. ఈ ఘటనలో కానిస్టేబుల్ గాయాలతో బయటపడ్డారు. సమీప ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు రెండు కేసులు నమోదు చేసి తరుణ్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించ గా, అతను భారీగా మద్యం సేవించినట్టు నిర్ధారణ అయింది. అతడిని కోర్టులో హాజరుపరచగా కోర్టు గుర్రంపాటి తరుణ్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది.



.webp)


