మునగాకు ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ వ్యక్తులు తినకూడదట..!
posted on: Feb 18, 2026 1:49PM

మునక్కాడల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. మునక్కాడలను వివిధ వంటకాల తయారీలో వాడుతూ ఉంటారు. అయితే మునగాకు గురించి చాలామందికి తెలియదు. పల్లె ప్రాంతాలలో విరివిగా మునగ చెట్లు పెరుగుతూ, మునగాకు విరివిగా లభించినా వాటిని ఆహారంలో భాగం చేసుకునేవారు మాత్రం చాలా తక్కువే.. అయితే చాలా ప్రాంత ప్రజలు మాత్రం మునగాకులో ఉన్న పోషకాలను, మునగాకు ఉపయోగాలను తెలుసుకుని డబ్బు వెచ్చించి మరీ మునగాకు కొని ఆహారంలో తీసుకుంటారు. అయితే మునగాకు ఆరోగ్యానికి మంచిదే అయినా, మునగాకును తినడం కొందరికి మంచిది కాదు. ఇంతకీ మునగాకు ఎవరు తినకూడదు? ఎందువల్ల తినకూడదు? తెలుసుకుంటే..
మునగాకు పోషకాలు..
మునగలో మొక్కల ఆధారిత ప్రోటీన్ ఉంటుంది. అలాగే విటమిన్-ఎ, విటమిన్-సి, విటమిన్-ఇ, కాల్షియం, పొటాషియం, ఐరన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్, బీటా క్వెర్సెటిన్ వంటివి మాత్రమే కాకుండా.. అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి.
మునగాకు ఎవరు తినకూడదు..
థైరాయిడ్..
థైరాయిడ్ సమస్యలతో ఉన్నవారు మునగ తినడం చాలా ప్రమాదం అంటున్నారు. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యను కలిగిస్తుంది. థైరాయిడ్ సమస్య ఉన్నవారు మునగ తినడం మానుకోవాలని చెబుతున్నారు.
లో బిపి..
మునగ ఆకులలో అధిక మొత్తంలో ఆల్కలాయిడ్లు ఉంటాయి. దీని వల్ల లో బిపి సమస్య ఉన్నవారికి మునగాకు తినడం వల్ల సమస్య పెరుగుతుంది.
గర్బిణీ స్త్రీలు..
గర్బిణీ స్త్రీలు లేదా పాలిచ్చే తల్లులు వైద్యుల సలహా లేకుండా మునగ తినకూడదని అంటున్నారు. ఇది గర్భస్రావం అయ్యే ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతారు.
సెన్సిటివ్ స్టమక్..
కడుపు సున్నితంగా ఉండేవారు ఉంటారు. ఇలాంటి వారు మునగ తీసుకోవడం చాలా పరిమితం చేయాలి. కడుపు సున్నితంగా ఉండేవారు మునగాకు తీసుకుంటే విరేచనాలు, తీవ్రమైన కడుపునొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...







