గచ్చిబౌలిలో మరోసారి డ్రగ్ పార్టీ భగ్నం.. 12 మంది అరెస్టు

విశ్వనగరం హైదరాబాద్‌ లో మరో సారి డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. నగరంలోని గచ్చిబౌలిలో   డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు.  కో–లివింగ్ & పీజీ హాస్టల్‌ గైజ్ లో‌లో నడుస్తున్న  గ్జరీ గెస్ట్ రూమ్ వద్ద డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారం మేరకు మాదాపూర్‌ ఎస్ఓటి పోలీసులు దాడి చేసి 12 మందిని అరెస్టు చేశారు.   అరెస్టైన వారిలో డ్రగ్స్‌ స్మగ్లర్‌  గుత్తా తేజ కృష్ణ తో పాటు నైజీరియన్‌ సాజీర్‌ కూడా  ఉన్నాడు. అలాగే డ్రగ్స్‌ వినియోగదారులుగా గుర్తించిన వెన్నెల రవికిరణ్‌, మన్నే ప్రశాంత్‌, పి. హర్షవర్ధన్‌ రెడ్డి, లోకేష్‌ రెడ్డి, పృథ్వి విష్ణువర్ధన్‌, కార్ల పొడి వెస్లీ సుజిత్‌, గుండబోయిన నాగార్జున‌, మేకల గౌతం, గుంటక సతీష్‌ రెడ్డిలను కూడా ఎస్ఓటి పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.

వీరందరూ గచ్చిబౌలిలోని కో–లివింగ్ & పీజీ హాస్టల్‌ లో నడుస్తున్న SM లగ్జరీ గెస్ట్ రూమ్ వద్ద డ్రగ్స్ పార్టీ  చేసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. పక్కా సమాచారం వీరందరినీ అరెస్టు చేసి,  31.2 గ్రాముల ఎండిఎంఏ, గంజాయి ప్యాకెట్లు, మొబైల్‌ ఫోన్లు, ఇతర పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు మరింత దర్యాప్తు చేపట్టారు. గుత్తా తేజకృష్ణ కర్ణాటక నుంచి ఎండిఎంఏ, గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్‌లోని యువతకు సరఫరా చేస్తున్నాడని, డ్రగ్స్ సరఫరాలో నైజీరియన్ సాజీర్ అతడికి సహకరిస్తున్నాడనీ పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu