ఆహార కల్తీ, మాదక ద్రవ్యాల నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు..!

posted on: Jul 5, 2026 6:28PM

 

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు యువతను లక్ష్యంగా చేసుకుని మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ రెండు సమస్యలను ఒకే వ్యవస్థ ద్వారా సమర్థవం తంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

ఈ క్రమంలో ప్రస్తుతం వేర్వేరుగా పనిచేస్తున్న ఆహార భద్రత (ఫుడ్ సేఫ్టీ) శాఖ, డ్రగ్ కంట్రోల్ శాఖలను విలీనం చేసి, ఒకే శాఖాధి పతి (హెచ్‌ఓడీ) ఆధ్వర్యం లో సమగ్ర సంస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఈ కొత్త సంస్థలో ఎన్‌ఫోర్స్‌మెంట్, లీగల్, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్), ప్రాసిక్యూషన్ విభాగాలను బలోపేతం చేసి, కల్తీ ఆహారం, నకిలీ ఔషధాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై మరింత సమన్వయంతో చర్యలు చేపట్టేలా వ్యవస్థను రూపొందించనున్నారు.

ఈ విషయాన్ని డీజీపీ ఆనంద్ వెల్లడించారు. ఆహార కల్తీ కేసులు, నకిలీ మందుల తయారీ, డ్రగ్స్ అక్రమ రవాణా వంటి నేరాలపై ప్రస్తుతం వివిధ శాఖలు విడివిడిగా పనిచేస్తుండటంతో సమన్వయం లోపిస్తున్న సందర్భాలు ఉన్నాయని, కొత్త వ్యవస్థ ద్వారా ఒకే కమాండ్ కింద వేగంగా విచారణ, దాడులు, కేసుల నమోదు, శాస్త్రీయ పరీక్షలు, న్యాయపరమైన చర్యలు చేపట్టే అవకాశం ఉంటుం దని ఆయన తెలిపారు. కొత్త సంస్థలో అమలు విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ప్రత్యేక దళాల పునర్వ్యవస్థీకరణ (డౌన్‌సైజింగ్) ద్వారా ఆదా అయ్యే కొంతమంది సిబ్బందిని వినియోగించా లని ప్రభుత్వం పరిశీలి స్తోంది. దీంతో ప్రత్యేక తనిఖీలు, ఆకస్మిక దాడులు, గూఢచారి సమాచార సేకరణ, అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు మరింత సమర్థవంతంగా అమలు చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఈ ప్రతిపాదనపై ఇప్పటికే సంబంధిత శాఖల ఉన్నతాధికారుల మధ్య పలు దఫాల చర్చలు జరిగాయని, ఆ చర్చలు సానుకూలంగా సాగాయని డీజీపీ వెల్లడించారు. దీంతో ఈ సంస్కరణలకు సంబంధించిన ప్రతిపాద నను ప్రభుత్వం త్వరలోనే తుది రూపం దాల్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం, కల్తీ ఆహారంపై ఉక్కుపాదం మోపడం, నకిలీ ఔషధాల తయారీని అరికట్టడం, మాదకద్రవ్యాల ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవడం లక్ష్యంగా ఈ సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ఆహార భద్రత, ఔషధ నియంత్రణ, డ్రగ్స్ నిరోధక చర్యల్లో తెలంగాణలో కొత్త విధానానికి నాంది పలికినట్లవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...