Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...డ్రగ్స్ కేసులో నాపేరు లాగితే చట్టపరమైన చర్యలు...కేటీఆర్ హెచ్చరిక
posted on: Mar 15, 2026 4:11PM
.webp)
మొయినాబాదులో పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ లో నిన్న సాయంత్రం సమయంలో జరిగిన డ్రగ్స్ పార్టీ గురించి ఈవిల్ టీంకు విశ్వసనీయమైన సమాచారం రావడంతో దాడులు చేసి ఆ పార్టీలో పాల్గొన్న 11 మందిని అదుపులోకి తీసుకొని వారికి డ్రగ్స్ టెస్టులు చేయడం జరిగింది. అయితే ఈ ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ తన ట్విట్టర్ ద్వారా కీలక వ్యాఖ్యలు చేశారు...అంతే కాకుండా డ్రగ్స్ వ్యవహారంలో తన పేరును అనవసరంగా లాగితే చట్టపరమైన నోటీసులతో స్పందిస్తానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
డ్రగ్స్ మనుషులను రాక్షసులుగా మార్చేస్తాయని, బాధ్యతా యుతమైన పదవుల్లో ఉన్నవారు కూడా డ్రగ్స్ వాడటం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.తాను వ్యక్తిగతంగా డ్రగ్స్ మరియు ఇతర అక్రమ పదార్థాల వాడకానికి పూర్తిగా వ్యతిరేకినని కేటీఆర్ స్పష్టం చేశారు. తమ పార్టీ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) డ్రగ్స్ వాడకాన్ని మరియు ఏ విధమైన చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఖండి స్తుందని తెలిపారు. డ్రగ్స్ వినియోగించే వారు గానీ, విక్రయించే వారు గానీ వారి రాజకీయ అనుబంధంతో సంబంధం లేకుండా చట్టం ప్రకారం కఠినంగా శిక్షించబ డాలని ఆయన అన్నారు.
అయితే, డ్రగ్స్ కేసును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించి బీఆర్‌ఎస్ పార్టీని ఈ విషయంలోకి లాగడం తాను తీవ్రంగా ఖండిస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌తో రాజకీయంగా స్కోర్లు సెటిల్ చేసుకోవడానికి డ్రగ్స్ కేసును ఉప యోగించడం అసహ్యకర మైన రాజకీయాలకు నిదర్శనమని విమర్శిం చారు.ఇప్పటికే తాను అనేకసార్లు చెప్పినట్లుగా, ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు డ్రగ్స్ పరీక్షలకు హాజరుకావాలన్న సూచనను స్వాగతిస్తున్నానని చెప్పారు. ప్రజాప్రతినిధులే ముందుగా ఉదాహరణగా నిలవాలని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే, భవిష్యత్తులో ఏ డ్రగ్స్ కేసులోనైనా తన పేరును అనవసరంగా ప్రస్తావిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని కేటీఆర్ గట్టిగా హెచ్చరించారు.






