Latest News

పుట్టా మహేష్‌ను సస్పెండ్ చేయాలి...విపక్షాలు డిమాండ్

posted on: Mar 15, 2026 3:50PM

మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పాజిటవ్ రావటంపై ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది.  ఎంపీ పుట్టాను వెంటనే టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. అధికార పార్టీ ఎంపీ డ్రగ్స్ కేసులో పట్టబడితే ఇంత వరకు సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు స్పందించకపోవడం దారుణమని వైసీపీ మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. 

ఎంపీ పుట్టాను తక్షణమే అనర్హత వేటు వేయాలని, తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఎంపీ కొకైన్‌తో విందు, చిందులు చేయడం దారుణమని... డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన ఎంపీ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని, యువతను డ్రగ్స్ వాడమని ప్రోత్సహిస్తున్నారా? అని షర్మిల నిలదీశారు. ఓట్లు వేసి గెలిపించిన ఏలూరు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ఆమె ప్రశ్నించారు. 

డ్రగ్స్‌పై నిజంగానే కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలనుకుంటే, ముందుగా తమ సొంత పార్టీ ఎంపీపై చర్యలు తీసుకుని సీఎం చంద్రబాబు తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని షర్మిల సవాల్ విసిరారు.డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తుంటే...డ్రగ్స్ కేసులో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి పట్టుబడటం సిగ్గు చేటని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ 10 ఏళ్ల పాలనలో విచ్చలవిడిగా దందా నడిచింది అని మనోహర్ రెడ్డి తెలిపారు.


 

google-ad-img
    Related Sigment News
    • Loading...