Latest News
దుబాయ్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. ఎయిర్ పోర్ట్ మూసివేత
posted on: Mar 16, 2026 9:15AM

దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో సోమవారం (మార్చి 16) తెల్లవారుజామున జరిగిన డ్రోన్ దాడి కారణంగా భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఎయిర్‌పోర్ట్ ఫ్యూయల్ ట్యాంక్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో ఎవరికీ ఎటువంటి అపాయం జరగలేదు. అయితే భారీగా మంటలు ఎగసిపడడంతో పాటు.. ఒక ఫ్యూయెల్ ట్యాంకర్ ధ్వంసమైంది. అయితే సహాయక బృందాలు మంటలను అదుపు చేశాయి.
ఈ ఘటనతో ముందు జాగ్రత్త చర్యగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. విమానరాకపోకలను నిలిపివేశారు. అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్‌లో విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా ఈ డ్రోన్ దాడికి పాల్పడింది ఎవరన్నదానిపై ఇంత వరకూ అధికారిక సమాచారం లేదు. మిడిల్ఈస్ట్ లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ దాడి ఇరాన్ పనేనని భావిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు. విమాన సర్వీసుల పునరుద్ధరణపై మాత్రం ఎటువంటి క్లారిటీ లేదు.



.webp)


