Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...యుద్ధాన్ని తక్షణమే ఆపండి...ఇరాన్, ఇజ్రాయెల్‌కు ట్రంప్ హెచ్చరిక
posted on: Jun 8, 2026 7:48PM
.webp)
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పీక్ స్టేజ్‌కు చేరాయి. ఒకరిపై ఒకరు క్షిపణులు, బాంబుల వర్షం కురిపించుకుంటూ సరిహద్దుల్లో మంటలు రేపుతున్నారు. ఈ తీవ్ర పరిణామాలపై ప్రపంచ పెద్దన్న, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కీలకమైన, ఘాటు హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ రెండు దేశాలూ తక్షణమే కాల్పులను విరమించాలని, ఇరుపక్షాలు షూటింగ్స్ ఆపేసి శాంతి చర్చలకు ముందుకు రావాలని ఆయన అల్టిమేటం జారీ చేశారు. సోమవారం తన స్వంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' వేదికగా ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం అగ్నిగుండంగా మారిన మిడిల్ ఈస్ట్‌లో శాంతిని నెలకొల్పేందుకు తాము తెరవెనుక తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఇప్పటికే ఇరుపక్షాల మధ్య అంతర్గతంగా శాంతి చర్చలు నడుస్తున్నాయని, ఇవి త్వరలోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే బుధవారం లోపు ఇరు దేశాల మధ్య ఒక చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరే సంకేతాలు ఉన్నాయని ట్రంప్ ఒక కీలక డేట్‌లైన్‌ను ప్రపంచం ముందు ఉంచారు. ఒకవేళ ఇరు దేశాలు పంతాలకు పోయి ఉద్రిక్తతలను తగ్గించకపోతే మాత్రం, అమెరికా రంగంలోకి దిగాల్సి వస్తుందని, భారీ సైనిక చర్య తప్పదని ట్రంప్ పరోక్షంగా హెచ్చరించడం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది.
ఇరాన్ జరిపిన మిస్సైల్ దాడుల వల్లే పశ్చిమాసియాలో మళ్లీ ఈ భయానక వాతావరణం నెలకొందని, ఆ దాడులకు ప్రతిచర్యగానే ఇజ్రాయెల్ ఎదురుదాడులకు దిగాల్సి వచ్చిందని ట్రంప్ ప్రస్తుత పరిస్థితిని విశ్లేషించారు. శాంతి చర్చలు సజావుగా సాగడానికి, ఈ ప్రాంతంలో యుద్ధం ముగిసిపోవడానికి తాను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడినట్లు ట్రంప్ స్పష్టం చేశారు. ఈ శాంతి ఒప్పందానికి అంగీకరించేలా నెతన్యాహును ఒప్పించడంలో తాను విజయవంతమయ్యానని ట్రంప్ పేర్కొన్నారు. చర్చలు ఇప్పుడు తుది దశకు చేరుకున్నాయని, ఇలాంటి తరుణంలో దాడులు మరింత తీవ్రం చేయడం ఒప్పందాన్ని చెడగొడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అదే సమయంలో, లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ దళాలు జరుపుతున్న వైమానిక దాడులను ట్రంప్ తీవ్రంగా ఖండించారు. లెబనాన్‌పై తక్షణమే సైనిక చర్యలను నిలిపివేయాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు తాను గట్టిగా సూచించానని, అందుకు ఇజ్రాయెల్ కూడా సానుకూలంగా స్పందించి, వెంటనే అంగీకరించిందని ట్రంప్ వివరించారు. ఇరాన్ కూడా పాత పంతాలను పక్కనబెట్టి మళ్లీ చర్చల టేబుల్ పైకి రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. బుధవారం నాటి గడువు లోపు శాంతి ఒప్పందం కుదిరి, ఈ ప్రాంతంలో శాంతి నెలకొంటుందో లేదో చూడాలి.


.webp)


