Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హిల్లరీ, ట్రంప్, మధ్యలో ఇండియా!
posted on: Oct 20, 2016 1:35PM

చాలా చిన్న చిన్న దేశాలు మొదలు భారతదేశం లాంటి పెద్ద దేశాల దాకా ఎక్కడ ఎన్నికలు జరిగినా, చర్చలు జరిగినా అమెరికా పేరు ఆటోమేటిక్ గా వస్తుంది. అగ్ర రాజ్యం అలా తన ప్రభావం విస్తరించింది. కొన్ని దేశాల్లో అమెరికా గొప్ప దేశమని టాక్ వుంటే మరి కొన్ని దేశాల్లో అమెరికా వల్లే విధ్వంసం జరుగుతోందని అంటుంటారు. ఇక మన దేశం లాంటి చోట్లలో అమెరికా మద్దతుదారులు, వ్యతిరేకులు ఇద్దరూ బలంగానే వుంటారు!
అమెరికా గురించి దేశదేశాల్లో మాట్లాడుకోవటం చాలా రోజులుగా మనకు అలవాటైపోయింది. కాని, అమెరికాలో , అదీ ఎన్నికల వేళ మన దేశం గురించి మాట్లాడుకోవటం... నిజంగా ఆశ్చర్యకరమే! కాని, అనూహ్యం మాత్రం కాదు! ఈ మధ్యే డానాల్డ్ ట్రంప్ తనకు హిందువులన్న , భారతీయులన్నా అభిమానం అన్నాడు. మోదీ గొప్ప నేత అని కూడా కితాబు ఇచ్చాడు. అక్కడితో ఆగకుండా తాను గెలిస్తే వైట్ హౌజ్ లో ఇండియాకు మంచి మిత్రుడు వున్నట్టే అంటూ భరోసా ఇచ్చాడు! అసలు ఇంతగా ఇండియా గురించి అమెరికన్ ఎన్నికల్లో చర్చకు రావటం ఇదే మొదటిసారి! అంతే కాక, ఏ మోదీనైతే తమ దేశంలోకి రానీయకుండా అమెరికా అడ్డుకుందో... అదే మోదీ మహానుభావుడంటూ ట్రంప్ మాట్లాడటం... మన సత్తాని చాటుతోంది! అమెరికాలోని అనివార్యమైన స్థితిని ప్రతిబింబిస్తుంది...
అమెరికాలో ఇప్పడు ఇండియా గురించి డిస్కషన్ కంపల్సరీ అయిపోయింది. అందుకు ఒక కారణం అక్కడి మన లక్షలాది భారతీయుల ఓట్లు హిల్లరీకి , ట్రంపుకు ఇద్దరికీ అవసరం కావటమే. రెండోది ... ప్రపంచంలోనే మనం అత్యంత వేగంగా దూసుకుపోతున్న ఆర్దిక వ్యవస్థ కావటం! ఈ కారణంతోనే తన లాస్ట్ డిబేట్ లో హిల్లరీతో పోటిపడ్డ ట్రంప్ ఇండియాను గుర్తు చేసుకున్నాడు! ప్రపంచంలో ఇప్పుడు ఇండియా, చైనా మాత్రమే అత్యధిక వృద్ధి రేటుతో ముందుకు పోతున్నాయన్నాడు. అందులోనూ చైనా 7శాతం అయితే భారత్ 8శాతంతో టాప్ లో వుంది. కాని, అమెరికా అభివృద్ధి రేటు ఒక్క శాతం మాత్రమే వుంది. ఇలా అయితే ముందు ముందు అగ్రరాజ్యానికి గడ్డు కాలమే అన్నాడు ట్రంప్. హిల్లరీ తనకు తోచిన రీతిలో దీనికి రిప్లై ఇచ్చింది....
ట్రంప్, హిల్లరీ మధ్య చర్చలో ఇండియా పేరు రావటం మారుతున్న ప్రపంచ పటానికి సంకేతం! ఒకప్పటిలా భూగోళం అంటే అమెరికా , యూరప్ మాత్రమే అని పరిస్థితి ఇక మీదట వుండదు. వాల్డ్ అంటే... అమెరికా, యూరప్ లతో కూడుకున్న ఇండియా అండ్ చైనా అని కూడా అంగీకరించాల్సిందే! లేటెస్ట్ యూఎస్ ఎలక్షన్స్ దాన్ని చెప్పకనే చెబుతున్నాయి!






