Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ట్రంప్ చీకటి కోణాలు ఎన్నో..ఎన్నెన్నో..!
posted on: Jun 3, 2016 12:03PM
.jpg)
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున బరిలోకి నిలిచిన డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు కాకముందే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాడు. వర్థమాన దేశాలను నోటికొచ్చినట్లు తిట్టడంతో మొదలుపెట్టి రోజుకోక వివాదంలో చిక్కుకుంటున్నాడు. మొన్నామధ్య తన వ్యాపార లావాదేవీల కోసం మాఫియాతో సంబంధాలు పెట్టుకున్నట్లు ఒక వెబ్‌సైట్ బయటపెట్టడంతో ప్రపంచం నివ్వెరపోయింది. అయితే ఇటీవల మీడియాపై నోరు పారేసుకోవడంతో ఇంతకాలం నుంచి బయటకు రాని రహస్యాలను మీడియా మిత్రులు బట్టబయలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రత్యర్ధులను, బయటి దేశాల వారిని తిట్టిన తిట్టకుండా తిట్టే ట్రంప్ తన దగ్గర పనిచేసే వారిని కూడా తిట్టేవారిని తెలిపింది. చెప్పింది చేయకుంటే ట్రంప్ నుంచి తిట్ల పురాణం వినాల్సిందేనని ఆయన దగ్గర పనిచేసిన ఉద్యోగులు స్వయంగా కోర్టుకు వెల్లడించిన ఆధారాలను మీడియా బహిర్గతం చేసింది.
రియల్ బూమ్ జోరుగా ఉన్న 2005లో ఫర్ ఫ్రాఫిట్ స్కూల్ పేరిట ట్రంప్ ఎఓ యూనివర్శిటీని ఏర్పాటు చేశారు. ఈ యూనివర్శిటీలో తమకు అన్యాయం జరిగిందని విద్యార్ధులు అమెరికా ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు. దీనిన విచారించిన న్యాయస్థానం వర్శిటీ ఉద్యోగుల వాంగ్మూలాలు నమోదు చేసుకుంది. ఈ సందర్భంగా వారు దిగ్భ్రాంతి కలిగించే నిజాలు వెల్లడించారు. యూనివర్శిటీలో తరగతులు చెప్పాలంటే ఉండాల్సింది విద్యార్హతలు కాదని, పరపతి అని, వ్యాపారం చేయడం వచ్చు అని ట్రంప్‌కు అనిపిస్తే చాలు. యూనివర్శిటీలో అధ్యాపకులుగా చేరవచ్చని తెలిపారు.
జ్యుయెలరీ షాపులో పని చేసే వ్యక్తి ఇక్కడ తరగతులు చెబుతాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధ్యాపకుడిగా అతని నియామకం చెల్లదు అన్నందుకు ట్రంప్‌తో తిట్లు తినాల్సి వచ్చిందని ఓ అధ్యాపకుడు తెలిపారు. యూనివర్శిటీగా మేనేజర్‌గా వ్యవహరించాల్సింది పోయి యూనివర్శిటీకి ప్రమోటర్‌గా వ్యవహరించాడని వర్శిటీ మాజీ మేనేజర్ ష్నాకెన్‌బర్గ్ తెలిపారు. ఆఖరికి పేద విద్యార్థుల పట్ల ట్రంప్ ఏ మాత్రం జాలి లేకుండా ప్రవర్తించేవాడని ఆయన అన్నారు. ఓ విద్యార్థి ఫీజులు కట్టలేని స్థితిలో ఉండటం చూసి ఫీజుల విషయంలో తాను పట్టించుకోలేదని, దీనికి ట్రంప్ నుంచి చివాట్లు తిన్నానని ఆయన న్యాయస్థానం ముందు ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి ట్రంప్ ఎక్కడ దొరుకుతాడా అని ఎదురు చూస్తున్న ప్రత్యర్థులకు ఈ వార్తలు అస్త్రాలుగా మారాయి.






