Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కాకరకాయ వండేటప్పుడు విత్తనాలు తొలగిస్తున్నారా..వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకవుతారు..!
posted on: Aug 21, 2026 3:03PM

కాకరకాయ అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది దాని చేదు రుచే. అయితే కాకరకాయను చేదు లేకుండా వండే క్రమంలో చాలామంది వాటిని ఉప్పులో, చింతపండు రసంలో నానబెడుతూ ఉంటారు. వీటి కారణంగా అందులో విత్తనాలు వచ్చేస్తుంటాయి. మరికొందరు కావాలనే కాకరకాయ నుండి విత్తనాలను తీసేసి పారేస్తుంటారు. అయితే కాకరకాయలోని విత్తనాల్లో కూడా కొన్ని పోషక విలువలు ఉంటాయని చాలామందికి తెలియదు. కాకరకాయ నుండి విత్తనాలు తొలగించే ముందు అందులో ఉన్న పోషకాల గురించి వివరంగా తెలుసుకోవాలి. అవేంటంటే...
కాకరకాయ విత్తనాలలో పోషకాలు..
కాకరకాయలోని విత్తనాల్లో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్‌తో పాటు బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. అయితే విత్తనాల పోషక విలువ కాకరకాయ రకం, పక్వత, వంట విధానాన్ని బట్టి మారతాయట.
కాకరకాయ విత్తనాలు ప్రయోజనాలు..
జీర్ణక్రియకు ఉపయోగపడొచ్చు
కాకరకాయలో ఫైబర్ ఉంటుంది. సరైన మోతాదులో తీసుకుంటే ఆహారంలో ఫైబర్ పెరగడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా ఉండటానికి, మలబద్ధకం తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. కాకరకాయ విత్తనాలు తినడానికి ఇష్టపడని వారు వాటిని కారం పొడిలాగా కూడా చేసుకుని తింటారు.
యాంటీఆక్సిడెంట్లు..
కాకరకాయలో వివిధ యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను ఎదుర్కోవడంలో సహాయపడే సామర్థ్యం కలిగి ఉండవచ్చు.
రక్తంలో చక్కెర..
కాకరకాయను రక్తంలో చక్కెర నియంత్రణకు ఉపయోగిస్తారని చాలాకాలంగా చెబుతుంటారు. కాకరకాయలోని కొన్ని సమ్మేళనాలు గ్లూకోజ్ మెటబాలిజంపై ప్రభావం చూపుతుంది. కాకరకాయనే కాకుండా కాకరకాయ విత్తనాలను కూడా ఆహారంలో తీసుకోవడం మరీ మంచిది.
విత్తనాలు ఎప్పుడు తీసేయాలి?
కాకరకాయ చిన్నగా, లేతగా ఉన్నప్పుడు దాని విత్తనాలు సాధారణంగా మృదువుగా ఉంటాయి. అలాంటి కాకరకాయను వండేటప్పుడు విత్తనాలను తీసేయాల్సిన అవసరం ఉండదు.
అయితే కాకరకాయ బాగా ముదిరినది అయితే అందులో విత్తనాలు గట్టిగా ఉంటాయి. ఇలాంటి విత్తనాలను కారం పొడి వంటి వంటకంగా తయారు చేసుకుంటే మంచిది.
*రూపశ్రీ.






