ఆర్సీబీపై డీకే ప్రశంసల వర్షం

posted on: Jun 1, 2026 8:54AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్  2026 విజేతగా నిలిచిన ఆర్సీబీపై కర్నాటక కాబోయే సీఎం డీకే శివకుమార్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆర్సీబీ టోర్నీ ఆసాంతం రియల్ చాంపియన్లుగా ఆడారని పేర్కొంటూ, జట్టు సభ్యులకు, యాజమాన్యానికి అభినందనలు తెలిపారు.  

బెంగళూరు మరోసారి ఛాంపియన్‌గా  నిలిచింది. ఈసారి కూడా కప్ మనదే  అంటూ సామాజిక మాధ్యమ వేదికలో హర్షం వ్యక్తం చేశారు. వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్ గెలిచి ఆర్సీబీ చరిత్ర సృష్టించిందని పేర్కొన్న ఆయన పట్టుదల, దీక్ష, సంయమనంతో ఆడి నిజమైన ఛాంపియన్లలా నిలిచారన్నారు.

 ఆర్సీబీ జట్టు యావత్ బెంగళూరు గర్వపడేలా చేసిందనీ,  ఈ అద్భుత ప్రయాణంలో అడుగడుగునా జట్టుకు అండగా నిలిచిన ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బందితో పాటు కోట్లాది మంది అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు.  ఇది మన ఆర్సీబీకి  సువర్ణాధ్యాయం అని పేర్కొన్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...