సీఎం సిద్ధరామయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన డీకే శివకుమార్
posted on: Feb 15, 2026 12:25PM

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య నిలువెత్తు విగ్రహాన్ని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్వయంగా ఆవిష్కరించారు. కర్ణాటకలోని హవేరీలో జరిగిన భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విగ్రహావిష్కరణ జరిగింది. దీంతో గత కొద్ది రోజులుగా ఇద్దరు అగ్రనేతలు మధ్య అధిపత్య పోరు ఉందనే ప్రచారానికి చెక్ పెడుతూ సిద్దరామయ్యపై తనకున్న గౌరవాన్ని అభిమానాన్ని డీకే శివకుమార్ ఈ రూపంలో చాటుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఐక్యతను, సమష్టి కృషిని ప్రజలకు చాటడమే ఈ కార్యక్రమం లక్ష్యమని డిప్యూటీ సీఎం తెలిపారు.
గ్యారంటీ పథకాల అమలులో ముఖ్యమంత్రి పోషించిన పాత్రను కొనియాడుతూ, ఆయన చరిత్రలో ప్రజా నాయకుడిగా నిలిచిపోతారని అన్నారు.విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత సిద్ధరామయ్యకు డీకే శివకుమార్ ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ముఖ్యమంత్రి పదవి రేసులో ఎప్పుడూ పోటీపడే ఈ ఇద్దరు నేతల మధ్య ఇలాంటి ఐక్యతను చూపడం రాష్ట్ర రాజకీయాలకు నూతన సంకేతంగా మారింది. ఈ విగ్రహావిష్కరణ పార్టీలో ఐక్యతను బలపరిచినట్లు కనిపిస్తోంది.


.webp)



