Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...యూట్యూబ్ సేవల్లో అంతరాయం
posted on: Feb 18, 2026 8:33AM
.webp)
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ వేదిక యూట్యూబ్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొ న్నారు. వీడియోలు ప్లే కాకపోవడం, యాప్ ఓపెన్ కాకపోవడం, వెబ్‌సైట్ లోడ్ కాకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ యూజర్లు సామాజిక మాధ్యమం వేదికగా ఫిర్యాదులు చేశారు. అలాగే సర్వర్ సమస్యలపై పర్యవేక్షణ చేసే ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్ డిటెక్టర్ కూ పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. స్వల్ప వ్యవధిలోనే వేల ఫిర్యాదులు నమోదయ్యాయి. .
భారత్, అమెరికా, యూరప్ సహా పలు దేశాలలో ఇదే పరిస్థితి నెలకొంది. ఇక యూట్యూబ్ సేవలలో అంతరాయంపై యూట్యూబ్ యాజమాన్యం స్పందిం చింది. స్ట్రీమింగ్ సేవల్లో సమస్యలు ఉన్నట్లు ఫిర్యాదులు అందినట్టు ధృవీకరించింది.
ఈ సమస్యను పరిష్కరించేందుకు సాంకేతిక బృందం పనిచే స్తోందని, త్వరలోనే పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని భరోసా ఇచ్చింది. అలాగే అప్‌డేట్స్ ఇస్తామని పేర్కొంది. యూట్యూబ్ సేవలు నిలిచిపోవడంతో కంటెంట్ క్రియేటర్లు, విద్యార్థులు, ఆన్‌లైన్ క్లాసులు, లైవ్ స్ట్రీమింగ్‌లపై ఆధారపడే వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.


.webp)



