కడియం కేసులో తీర్పు రిజర్వ్...దానం విచారణ వాయిదా

posted on: Mar 5, 2026 7:51PM

 

తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ ఎదుట విచారణ గురువారం కీలక దశకు చేరుకుంది. మాజీ మంత్రి కడియం శ్రీహరి కి సంబంధించిన అనర్హత పిటిషన్‌పై వాదనలు ముగియడంతో స్పీకర్ తీర్పును రిజర్వ్ చేసినట్లు సమాచారం. మరోవైపు ఎమ్మెల్యే దానం నాగేందర్ కి సంబంధించిన పిటిషన్‌పై విచారణను శనివారానికి వాయిదా వేశారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడు ఎమ్మెల్సీ పైడి  కౌశిక్ రెడ్డి  తరఫున న్యాయవాదులు సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఇప్పటికే రాతపూర్వక వివరణను స్పీకర్‌కు సమర్పించారు. పిటిషనర్ తరఫు న్యాయ వాదులు తమ వాదనలు పూర్తి చేసినట్లు వెల్లడించారు.

పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది అభినవ్ కృష్ణ మాట్లాడుతూ..., తమ పిటిషన్ పూర్తిగా చట్టబద్ధ మైనదని స్పీకర్‌కు వివరిం చినట్లు తెలిపారు. ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసినట్లు అఫిడవిట్‌ లో ఉన్న వివరాలను, అలాగే రిటర్నింగ్ అధికారి అందించిన విజేతల జాబితాను స్పీకర్‌కు సమర్పించినట్లు చెప్పారు.

అదే విధంగా దానం నాగేందర్ సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినట్లు ఉన్న ఆధారాలను కూడా సమర్పించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో తమ పిటిషన్‌ను పరిగణన లోకి తీసుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరినట్లు పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా మరోవైపు దానం నాగేందర్ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపిం చేందుకు మరింత సమయం కోరారు. దీనిపై స్పందించిన స్పీకర్ తదుపరి విచారణను శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేశారు. ఆ రోజు దానం నాగేందర్ తరఫు న్యాయ వాదులు తమ వాదనలు వినిపించనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ కేసులో బీజేపీ తరఫు న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపిస్తూ, ఈ పిటిషన్ విచారణకు పూర్తిగా అర్హత కలిగినదేనని స్పష్టం చేశారు. అయితే బీఆర్‌ఎస్ వేసిన పిటిషన్ విచారణకు అర్హత లేదని వారు వాదించారు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికే ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుంది. ముఖ్యంగా కడియం శ్రీహరి కేసులో స్పీకర్ తీర్పు రిజర్వ్ కావడం, అలాగే దానం నాగేందర్ పిటిషన్‌పై విచారణ కొనసాగుతుం డటంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ స్పీకర్ తీసుకునే తుది నిర్ణయం రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...