Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మద్యం మత్తులో రచ్చ.. సినీ దర్శకుడి కుమారుడు అరెస్ట్
posted on: Mar 4, 2026 1:49PM

హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ ప్రాంతంలో మద్యం మత్తులో వాహనం నడిపి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో దర్శకుడు మణిశంకర్ కుమారుడు ప్రేమ్ శంకర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, ప్రేమ్ శంకర్ తన ఎలక్ట్రిక్ కారులో రోడ్ నెం.3 వద్ద పంజాగుట్ట వైపు నుంచి శ్రీనగర్ కాలనీ దిశగా వెళ్తుండగా వాహనం బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అయి రోడ్డు మధ్యలో ఆగిపోయింది. సాయంత్రం రద్దీ సమయం కావడంతో ట్రాఫిక్ స్తంభించింది.అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోంగార్డు వాహ నాన్ని పక్కకు జరిపేందుకు సహకరించాలని కోరగా, మద్యం మత్తులో ఉన్న ప్రేమ్ శంకర్ నిర్లక్ష్యంగా వ్యవహ రించాడు. దీంతో హోం గార్డు మన్యం వెంటనే సినీ దర్శకుడు కుమారుడికి బ్రీత్ ఎనలైజర్ చేసేందుకు ప్రయత్నించారు.
కానీ బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు కూడా ఆయన సహకరించలేదని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా దర్శకుడి కుమారుడు ప్రేమ్ శంకర్ ఒక్కసారిగా హోంగార్డ్ మన్యంపై విరుచుకుప డ్డాడు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం టోయింగ్ వాహనంతో కారును తొలగించే ప్రయత్నంలో ప్రేమ్ శంకర్ అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిం చగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిర్వహించిన బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో అధిక మోతాదులో మద్యం సేవించినట్లు నిర్ధారణ అయింది.ఈ ఘటనపై బంజారాహిల్స్ ట్రాఫిక్ ఎస్ఐ రామ్మోహన్ ఫిర్యాదు మేరకు క్రిమినల్ కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. నగరంలో మద్యం మత్తులో వాహనదారులపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.


.webp)
.webp)


