Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మైనర్లకు డిజిటల్ భద్రత.. దేశంలోనే తొలి రాష్ట్రం కర్నాటక
posted on: Mar 6, 2026 2:38PM
.webp)
పిల్లలకు డిజిటల్ భద్రతకు సంబంధించి కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 16 ఏళ్లలోపు మైనర్లకు సోషల్ మీడియాను నిషేధించనున్నట్లు సీఎం సిద్దరామయ్య అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికారికంగా ప్రకటించారు. పిల్లలు ,టీనేజర్లపై సోషల్ మీడియా దుష్ప్రభావం చూపుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. కాగా దేశంలో ఈ దిశగా చొరవ తీసుకుని పిల్లలకు సోషల్ మీడియాను దూరం చేసిన తొలి రాష్ట్రంగా కర్నాటక నిలిచింది.
కర్ణాటక ప్రభుత్వం ఒక సాహసోపేత నిర్ణయం ప్రకటించింది కానీ పటిష్టంగా అమలు చేసే విషయంలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నకిలీ బర్త్ సర్టిఫికేట్లు, నకిలీ అక్కౌంట్ల బెడద ఎక్కువ అవుతందని పరిశీలకులు అంటున్నారు. పూర్తి నిషేధం కంటే తల్లిదండ్రుల అనుమతి ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థ మేలని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా పిల్లలకు సోషల్ మీడియా అందుబాటులో లేకుండా చేయాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందు కోసం ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అలాగే పలు దేశాలలో ఇప్పిటికే పిల్లలకు సోషల్ మీడాయా యాక్సెస్ ను నిషేధించిన సంగతి తెలిసిందే.






