Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...క్యాష్‌లెస్ యుగంలో భిక్షాటనకు కొత్త రూపం…క్యూఆర్ కోడ్ ట్రెండ్
posted on: Apr 12, 2026 11:52AM

డిజిటల్ చెల్లింపులు వేగంగా విస్తరిస్తున్న ఈ రోజుల్లో, టెక్నాలజీ ప్రభావం సమాజంలోని ప్రతి వర్గానికీ ఎలా చేరుతోందో చూపించే ఆసక్తికర ఉదాహరణ ఇది. ఒకప్పుడు చిల్లర కోసం అడిగే భిక్షాటన ఇప్పుడు “స్కాన్ చేసి పంపండి” దశకు చేరుకుంది. ఈ వినూత్న పరిణామం మొదట రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల పట్టణంలో వెలుగులోకి వచ్చింది.
పట్టణ నడిబొడ్డున గాంధీ చౌక్ సమీపంలో ఓ భిక్షుకుడు చేతిలో క్యూఆర్ కోడ్ పట్టుకుని రోడ్లపై తిరుగుతూ భిక్ష అడుగుతున్నాడు.“అమ్మా… అయ్యా… డబ్బులు ఇవ్వండి… లేకపోతే నా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పంపండి” అంటూ ప్రజలను వేడుకుంటూ కనిపిస్తున్నాడు. నగదు తీసుకెళ్లని కాలానికి తగ్గట్టుగా అతడు ఈ కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడితో ఈ క్యాష్‌లెస్ భిక్షాటన ఆగలేదు. హైదరాబాద్‌లోని ప్రసిద్ధ పెద్దమ్మ గుడి వద్ద కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది.
అక్కడ గంగిరెద్దుల బృందం గోమాత నుదుటిపై క్యూఆర్ కోడ్ అమర్చి భిక్ష అడుగుతూ కనిపించడం విశేషం.ఒకప్పుడు “చిల్లర లేదు” అంటే భిక్ష ఇవ్వకుండా వెళ్లిపోయే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు “స్కాన్ చేయండి” అన్న ఒక్క మాటతో భిక్షాటన కూడా డిజిటల్ మార్గంలోకి అడుగుపెట్టింది.టెక్నాలజీ మార్పులు సమాజంలోని అట్టడుగు వర్గాల జీవన విధానాలపై కూడా ఎంత ప్రభావం చూపుతున్నాయో తెలియజేసే ఆసక్తికర సంఘటనలుగా ఇవి నిలుస్తున్నాయి.



.webp)


