ఆప‌రేష‌న్ సింధూర్ వ‌ర్సెస్ ఆప‌రేష‌న్ ఎపిక్ ప్యూరీ.. తేడాలివేనా?

posted on: Jun 8, 2026 4:36PM

సింగపూర్‌లో జరిగిన షాంగ్రి-లా డైలాగ్‌లో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మాట్లాడుతూ, భారతదేశాన్ని అత్యంత‌  శక్తిమంతమైన దేశ‌మ‌ని అన‌డంతో పాటు..  ఈ దేశం తన సైన్యాన్ని  ఆధునికీకరిస్తోంది  అని కూడా కొనియాడారు. ఏది ఏమైనా, ఇండో, పసిఫిక్ స్థిరత్వానికి భారత్ ఒక  క్రిటికల్ యాంకర్  అని చెప్పారు  అమెరిక‌న్ ర‌క్ష‌ణ మంత్రి పీట్ హెగ్సెత్. దీన‌ర్ధ‌మేంటంటే..  దక్షిణ ఆసియాలో భారత్ ఒక కీలకమైన లంగరు. శక్తిమంతమైన భారత్ తన స్వంత ప్రయోజనాల కోసం చర్యలు తీసుకోవడం, ప్రాంతీయ శక్తి సమతుల్యతను కాపాడటంలో మన సాధారణ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తుంద‌ని కూడా అన్నారాయ‌న‌. ఇండో, పసిఫిక్ స్థిరత్వానికి భారత్ అత్యంత కీలకమ‌ని ఆయ‌న మాట‌ల సారాంశం.  

2026 గ్లోబ‌ల్ ఫైర్ ప‌వ‌ర్ ఇండెక్స్ ప్ర‌కారం... ఇండియా   ప్రస్తుతం ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద సైనిక శక్తిగా ఉంది. యునైటెడ్ స్టేట్స్, రష్యా, చైనా తర్వాత, ఇండియాయే  అతి పెద్ద ఆర్మీ ప‌వ‌ర్. ఈ క్ర‌మంలో పాకిస్తాన్ 16వ స్థానానికి పడిపోయింది.  2024లో పాకిస్థాన్  9వ స్థానంలో ఉండేది. ఈ తేడా, భారత్, పాక్ సైనిక సామర్థ్యాల వ్యత్యాసాన్ని  ఎంతో స్పష్టంగా చూపిస్తుంది.
 
2025 ఏప్రిల్ 22న, పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది,  ఆ దాడిలో  26 మంది   భార‌త‌ పౌరులు హత్యకు గురయ్యారు. ఇది పాక్ ప్రేరేపిత‌ ఉగ్రవాద సంస్థల ద్వారా జరిగింది.  ఇది భారత్-పాక్ సంబంధాలలో ఒక మలుపు. ఈ దాడి తర్వాత.. ఇండియా ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రతిస్పందించింది, ఇది 1971 యుద్ధం తర్వాత జరిగిన అతిపెద్ద భారత్, పాక్ సైనిక ఘర్షణలలో ఒకటి.

అదే సమయంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా ఇరాన్‌పై ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ప్రారంభించింది, ఇది మధ్యప్రాచ్యంలో అమెరికా చేసిన అతిపెద్ద సైనిక చర్యలలో ఒకటి. ఈ రెండు ఆపరేషన్ల మధ్య ఉన్న తేడా..  భారత్, అమెరికా దేశాల‌ సైనిక సామర్థ్యాలను, వ్యూహాలను స్పష్టం చేస్తుంది. 

2025 ఏప్రిల్ 22, పహల్గామ్ ఉగ్రదాడి,  26 మంది పౌరులు హత్య జ‌రిగితే.. ఇండియా  అందుకు ప్ర‌తీకారంగా.. 2025 మే 7 ఆపరేషన్ సిందూర్ చేపట్టి.. పాక్ భూభాగంలోని  9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది.  చేసింది.  2025 మే 7, 10 తేదీల మధ్య జ‌రిగిన‌ ప్రధాన దాడులు ఎలాంటివో చూస్తే.. 11 పాక్ వైమానిక స్థావరాలపై భార‌త్ దాడులు చేయ‌గా.. 13 పాక్ విమానాలు ధ్వంసం అయ్యాయి.  2025 మే 9-10లలో   పాక్ వైమానిక స్థావరాలపై భార‌త్ దాడులు చేయ‌గా.. అందులో నూర్ ఖాన్, ముషాఫ్, భోలారి, షాబాజ్ ఉన్నాయి. 2025 మే 10న సాయంత్రం ఐదు గంట‌ల‌కు- పాక్ డీజీఎంవో, భారత డీజీఎంవోను సంప్రదించి.. కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవ‌ల్సి  వ‌చ్చింది. 2026 మే 6న‌ ఆపరేషన్ సింధూర్ మొదటి  వార్షికోత్సవం జ‌రిగింది.  

ఆప‌రేష‌న‌న్ ఎపిక్ ప్యూరీ విష‌యానికి వ‌స్తే..  ఇది 2026 ఫిబ్రవరి 28న‌ ప్రారంభమైంది. ఇరాన్‌పై అమెరికా సైనిక చర్య న‌ల‌భై  రోజుల పాటు జ‌ర‌గ్గా..  రెండు వేల‌కు పైగా ఇరాన్ లక్ష్యాలపై దాడులు చేశారు. 2026 మే నాటికి 42 అమెరికా విమానాలు దెబ్బతిన్నాయి.. ఖర్చు  29 బిలియన్ డాల‌ర్లుగా  తేలింది.  2026 మే 12న‌ పెంటగాన్, అమెరిక‌న్ కాంగ్రెస్‌కు  29 బిలియన్ డాల‌ర్ల‌ ఖర్చు నివేదిక అందించింది. అదే భార‌త్ ఖ‌ర్చు ఇంత‌ని  నిర్దారించ‌లేదు. కానీ, ఒక‌టి రెండు బిలియ‌న్లు ఉండొచ్చ‌ని అంచ‌నా. 

ఆపరేషన్ సింధూర్ వ‌ర్సెస్ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ తేడాలేంటో ప‌రిశీలిస్తే..  ఆపరేషన్ సింధూర్- ఇండియా,  ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ- అమెరికా. ఈ రెండు ఆప‌రేష‌న్ల  కాల‌ప‌రిమితిలో తేడా చూస్తే ఒక‌టి 4 రోజులు, మ‌రొక‌టి న‌ల‌భై ప్ల‌స్ రోజులు. ఆప‌రేష‌న్ సిందూర్ 2025 మే 7,10 తేదీల  మ‌ధ్య‌జ‌రిగింది. భార‌త్ పాక్ లోని 9 ఉగ్రవాద శిబిరాల‌ను ధ్వంసం  చేయ‌గా, అదే అమెరికా త‌న 40కి  పైగా  రోజుల్లో జ‌రిగిన  ఆప‌రేష‌న్లో, .  2 వేల‌కు పైగా ఇరాన్ టార్గెట్ల‌ను ఛేజ్ చేసింది.

భార‌త్ పాక్ కి చెందిన 13 విమానాల‌ను ధ్వంసం చేయ‌గా.. అదే యూఎస్ ఇరాన్ విమానాల‌ను ధ్వంసం చేసింది  సున్నా. ఇక రెండు దేశాల  ఉద్దేశాలు ఎలాంటివో చూస్తే- భార‌త్ పాక్ లోని ఉగ్ర‌వాద మౌలిక స‌దుపాయాల‌ను నాశ‌నం  చేయాల‌ని ప్ర‌య‌త్నించ‌గా.. అదే యూఎస్, ఇరాన్ అణుకార్య‌క్ర‌మాన్ని నిరోధించాల‌ని ఈ ఆప‌రేష‌న్ స్టార్ట్ చేసింది.

భారతదేశం ఆపరేషన్ సింధూర్‌ను స్వయం రక్షణ కోసం, చేశామ‌ని ప్రకటించింది, ఇది యూఎన్ ఆర్టికల్- 51 ప్రకారం చట్టబద్ధం. పహల్గామ్ దాడి తర్వాత, భారతదేశం  పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోంద‌ని ఒక కార‌ణం చూపించింది, ఇది ప్రతిస్పందనకు చట్టబ‌ద్ధ‌మైన‌ ఆధారం. 

యూఎన్ ఆర్టికల్ 51 ప్రకారం..  భారత్ తన పౌరులను రక్షించుకోవడానికి సైనిక చర్య తీసుకోవ‌డానికి  కేవ‌లం యూఎన్ మాత్ర‌మే కాదు స‌మ‌స్త ప్ర‌పంచం ఆమోద‌యోగ్యంగానే  చూసింది. దానికి తోడు భార‌త్ కేవ‌లం ఉగ్ర‌వాద టార్గెట్ల‌పై  మాత్ర‌మే   దాడి చేసింది. ఎట్టి  ప‌రిస్థితుల్లోనూ  పాక్ పౌర, మౌలిక సదుపాయాలపై దాడి చేయ‌లేదు.  భార‌త్ త‌న‌ లక్ష్యాలు పూర్తయిన తర్వాత,  స్వయంప్రతిపత్తిగా కాల్పుల విరమణ ప్రకటించింది.

ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ..  అది ఎదుర్కుంటున్న‌ చట్టపరమైన సవాళ్లు ఎలాంటివో చూస్తే..  అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, ఇరాన్ అణు కార్యక్రమం నిరోధించడానికి జరిపింది. అయితే, ఇరాన్ అణ్వాయుధాలు లేని దేశంగా పరిగణించబడుతోంది, ఎలాంటి అణ్వాయుధాల్లేని దేశంపై ఇలాంటి భీక‌ర దాడులు చేయ‌డం చ‌ట్ట‌ప‌రంగా   నేరం.  అమెరికా ఇరాన్ పై జ‌రిపిన దాడికి యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆమోదం లేదు.  29 బిలియన్ ఖర్చు, 42 విమానాలు నష్టం సైతం ఆమోద‌యోగ్యంగా లేవు. ఇక ఇరాన్ అణ్వాయుధాలు లేనప్పటికీ, అణు కార్యక్రమం  అంతర్జాతీయ ఆందోళన  అని అమెరికా అంటోంది. 

హెగ్సెత్ షాంగ్రి-లా డైలాగ్‌లో మాట్లాడుతూ.  భారతీయ రక్షణ ఉత్పాదక సామర్థ్యాలను ప్రశంసిస్తూ, భవిష్యత్తులో భారత్ అమెరికా నౌకాదళ నౌకలకు మద్దతు ఇవ్వగలద‌ని కూడా అన్నారు. ఆయన సంయుక్త ఉత్పాదన గురించి కూడా ప్రస్తావించారు.  ఇండో-పసిఫిక్ రీజియన్‌లో భారతదేశం మరింత పెద్ద పాత్ర పోషించడానికి అవ‌కాశ‌ముంద‌ని కూడా అన్నారు అమ‌రికా డిఫెన్స్ మినిస్ట‌ర్. 

భారత్ లో ఆపరేషన్ సింధూర్‌పై జాతీయవాద భావోద్వేగం సైతం బాగా పెరిగింది. 2026 మే 6న, ఆపరేషన్ సింధూర్ 1వ వార్షికోత్సవం సందర్భంగా, ఎయిర్ మార్షల్ భార్తీ.. 13 పాక్ విమానాలు ధ్వంసం చేశామ‌ని స‌గ‌ర్వంగా ప్రకటించారు. ఇది భారత సైన్యం తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటడంగా ఆయన  చెప్పుకొచ్చారు.  పాకిస్తాన్‌లో  ఆపరేషన్ సింధూర్ రాజకీయ సంక్షోభాన్ని కలిగించిందనీ. పాక్ వైమానిక దళం 13 విమానాలు కోల్పోవడం, 11 వైమానిక స్థావరాలు నాశనం అవ్వడం, పాక్ సైనిక నాయకత్వంపై విశ్వాసాన్ని తగ్గించిందనీ అన్నారాయ‌న‌.

భారత్, పాకిస్తాన్ - అమెరికా, ఇరాన్- 2026 ఫైర్ ప‌వ‌ర్ ర్యాంకుల‌ను ఒక‌సారి  ప‌రిశీలిస్తే.. వ‌రుస‌గా ఇవి 4, 14, 1, 16వ స్థానాన్ని సూచిస్తాయి. ఇక ఇక భార‌త్ కి రాఫెల్, సు- 30 కెఎంకేఐ, తేజ‌స్ ఉండ‌గా.. అదే యూఎస్ కి జేఎష్‌-17, ఎఫ్-16, జే-10ఎంసీ, ఎఫ్-22, ఎఫ్ 35, ఎఫ్‌- 15, ఎఫ్‌- 4, ఎఫ్‌-5, ఎఫ్-14, మిగ్- 29ల‌ను క‌లిగి ఉంది.. క్షిప‌ణి  సామ‌ర్ధ్యాల్లో భార‌త్- పాక్ మ‌ధ్య తేడా చూస్తే, భార‌త్ బ్ర‌హ్మోస్ అనే సూప‌ర్  సానిక్ తో పాటు అగ్నిని సైతం క‌లిగి  ఉండ‌గా.. అదే  పాక్ బాబ‌ర్, షాహిన్ క‌లిగి ఉంది. ఇక యూఎస్ టోమ్హాక్, మినిట్ మాన్ ని క‌లిగి ఉండ‌గా.. ఇరాన్ షాహెబ్, సెజిల్ ని క‌లిగి  ఉంది. ఈ నాలుగు దేశాల్లో మూడింటికి అణ్వాయుధ  సామ‌ర్ధ్యం ఉండ‌గా.. ఒక్క  ఇరాన్ మాత్రం ఈ ఫెసిలీటీ అధికారికంగా క‌లిగి  లేదు.  

అందుకే హెగ్సిత్ అంటారు. ఇండో-పసిఫిక్‌లో శక్తి సమతుల్యతను కాపాడుకోవడం, చైనాతో ఘర్షణను నివారించడం అమెరికా లక్ష్యం కాగా. భారత్ ఈ లక్ష్యాన్ని సాధించడానికి కీలకంగా ప‌ని చేస్తుంద‌ని అంటారాయ‌న‌.  హెగ్సెత్, ఆసియా మిత్ర దేశాలను రక్షణ ఖర్చును GDPలో 3.5శానికి పెంచాలని కోరారు. ఇది అమెరికా భాగస్వామ్య బాధ్యత సిద్ధాంతాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. భారత్-అమెరికా రక్షణ సహకారం విష‌యానికి వ‌స్తే.. హెగ్సెత్, ఈ విష‌యాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు.  

భారత్ లో అమెరికా ఆయుధాలు తయారీ, లాజిస్టిక్ స‌పోర్ట్, భారత్ అమెరికా నౌకాదళ నౌకలకు మద్దతు,  సాంకేతిక సహకారం.. ఏఐ, సెమీకండక్టర్స్, డ్రోన్స్, క్షిపణులు.. సైనిక వ్యాయామాలు అమెరికా-భారత్ సంయుక్త వ్యాయామాలు పెంచడం వంటివి ఇందులో కీల‌కం.

భారత్  ఆపరేషన్ సింధూర్‌పై..  జాతీయవాద భావోద్వేగం పెరిగింది. 2026 మే 6న, ఎయిర్ మార్షల్ భార్తీ- 13 పాక్ విమానాలు ధ్వంసం చేశామ‌ని ప్రకటించిన తర్వాత, సోషల్ మీడియాలో  #OperationSindoor ట్రెండ్ అయ్యింది. స‌రిగ్గా అదే స‌మ‌యంలో అమెరికాలో, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీపై విమర్శలు పెద్ద ఎత్తున‌ పెరిగాయి. 42 విమానాలు నష్టం, 29 బిలియన్ డాల‌ర్ల‌ ఖర్చు, కాంగ్రెస్‌లో తీవ్ర‌ విమర్శలకు దారితీసింది. 

భారత్ శక్తిమంతమైనది, తన సైన్యాన్ని ఆధునికీకరిస్తోంది. భారత్ కి భారీ పారిశ్రామికత‌, లాజిస్టిక్ సామర్థ్యం ఉంది, ఇది టీ గ్రేడ్ మిలిటరీ ఆపరేషన్లను నిర్వహించడానికి సహాయపడుతుంది.  దక్షిణ ఆసియాలో భారత్ ఒక కీలకమైన లంగరు. ఇండో-పసిఫిక్ స్థిరత్వానికి భారత్ అత్యంత కీలకం.  భవిష్యత్తులో భారత్ అమెరికా నౌకాదళ నౌకలకు మద్దతు ఇవ్వగలదు.  ఆసియా మిత్ర దేశాలు రక్షణ ఖర్చును GDPలో 3.5శానికి పెంచాలి.. అన్న అంశాలు బాగా హైలెట్ అయ్యాయి.   

పీట్ హెగ్సెత్ ప్రకటనలు, భారత్ ఇండో-పసిఫిక్‌లో కీలక భాగస్వామి అని స్పష్టం చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్, భారత్ సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించింది. 4 రోజుల్లో 13 పాక్ విమానాలు ధ్వంసం, 11 వైమానిక స్థావరాలు నాశనం, 0- భారత విమానాలు నష్టం. ఇక‌ అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ- 40 ప్ల‌స్ రోజుల్లో.. 42 విమానాలు నష్టం, 29 బిలియన్ డాల‌ర్ల‌ ఖర్చుతో పోలిస్తే తేడా  స్ప‌ష్టంగా  క‌నిపిస్తోంది. భారత్-అమెరికా రక్షణ సహకారం భవిష్యత్తులో మరింత బలోపేతమవుతుంది, ఇండో-పసిఫిక్ స్థిరత్వానికి భారత్ కీలక లంగరుగా మారుతుందన్న విష‌యాన్ని మ‌రోమారు ఎత్తి చూపుతోంది.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.    

google-ad-img
    Related Sigment News
    • Loading...