షుగర్‌కి చిట్టి చిట్కాలతో...పోగొట్టే భారతీయ ఆయుర్వేదం
posted on Nov 8, 2025 1:36PM

భారత ఆయుర్వేదం ఉసిరకాయతో షుగర్ ని కంట్రోల్ చేయగలదు. ఈ విషయం గుర్తించింది ఇక్కడి ఆయుర్వేద వైద్య లోకం. ఆంగ్లంలో ఆమ్లాగా పిలిచే ఉసిరిలో విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు, బయోయాక్టివ్ ప్లాంట్ కాంపౌండ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేయడంలో, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. భోజనం తర్వాత రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడాన్ని ఉసిరి తగ్గిస్తుందని కొన్ని స్టడీస్ సూచిస్తున్నాయి. అంత సింపుల్ షుగర్ కంట్రోల్ చేయడం భారత్ కి వెన్నతో పెట్టిన విద్య.
భారత్ తో ఉన్న మరో ఫెసిలిటీ ఏంటంటే ఇక్కడ వైద్యులు అమెరికా నిండా ఉన్నారు. వీరు అత్యంత గొప్ప నైపుణ్యంతో అమెరికా ఆరోగ్య సంరక్షణ చేస్తున్నారు. ఇలాంటి వారు రాకుండా కట్టడి చేస్తే అక్కడి జనారోగ్యానికే ప్రమాదం.
ఇప్పటికే అమెరికాలో టైప్ టూ డయాబెటిస్ నియంత్రణ కోసం మౌంజారో తో పాటు, టైప్ 1 డయాబెటీస్ కంట్రోల్ చేయడం కోసం స్టెమ్ సెల్ ఆధారిత చికిత్స కూడా పరిశోధనలో ఉంది. కొత్త మందులు ఆవిష్కరణతో పాటు గుండె జబ్బుల ప్రమాదం తగ్గించే మందులు, జీవన శైలి మార్పు చేర్పులలోనూ భారతీయ వైద్య నిపుణులది కీలక పాత్ర.
ఇలాంటివేవీ గుర్తించకుండా రాజకీయ కారణాలతో ఎలాగైనా సరే భారతీయులను ఇరుకున పెట్టాలి. మన దారికి తెచ్చుకోవాలన్న కుట్ర కొద్దీ తీస్కునే నిర్ణయాలతో అమెరికాకు చేటు తేవడానికి ట్రంప్ అత్యంత దగ్గరగా ఉన్నారని అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు.