Latest News
ఐపీఎల్‌లో ధోనీ ఆడటంపై సీఎస్‌కే క్లారిటీ!
posted on: Mar 12, 2026 4:36PM

ఐపీఎల్ 2026 సందడి మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున మహేంద్రసింగ్ ధోని అన్ని మ్యాచులు ఆడతాడని, ఆ జట్టు మేనేజ్మెంట్ ప్రకటించింది. సీఎస్‌కేని ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన ధోనీ ఈ సారి ఆడతాడా అని క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథ్ ఓ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సీజన్‌లో ధోనీ ఆడనున్నట్లు అధికారికంగా వెల్లడించారు.
ఎంఎస్ ధోనీ ఈ సీజన్‌లోనూ ఆడతాడని, బ్యాటర్‌గా ఆడతాడా? వికెట్ కీపర్ కమ్ బ్యాటర్‌గానా? ఇంపాక్ట్ ప్లేయర్‌గానా? అనేది టీమ్ మేనేజ్‌మెంట్ డిసైడ్ చేస్తుందని స్పష్టం చేశారు. టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంజు శాంసన్, శివమ్ దూబే ప్రస్తుతం సీఎస్‌కే జట్టులోనే ఉన్నారు.. వారి స్ఫూర్తితో ఐపీఎల్‌లో సీఎస్కే ఆటగాళ్లు ఈ సారి మరింత చెలరేగిపోయే అవకాశముంది. ఇక సీఎస్‌కే మ్యాచులన్నింటినీ చెన్నై వేదికగా ఆడతుందని ఆ జట్టు మేనేజ్మెంట్ ప్రకటించింది






