Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గాయంతో ధోనీ ఔట్.. సీఎస్కేకు షాక్
posted on: Mar 28, 2026 1:06PM
.webp)
సరిగ్గా ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీ గాయం కారణంగా టోర్నమెంట్‌కు ఆరంభ మ్యాచ్ లకు దూరం అయ్యాడు. కండరాల నొప్పితో బాధపడుతున్న ధోనీకి విశ్రాంతి అవసరమని, ప్రస్తుతం అతను రిహాబిలిటేషన్‌లో ఉన్నాడని సీఎస్ కే అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ప్రకటించింది. సరిగ్గా ఐపీఎల్ సీజన్ ప్రారంభం రోజునే ఈ ప్రకటన వెలువడింది.
చెన్నై ఈ సీజన్ లో తన తొలి మ్యాచ్ ను సోమవారం (మార్చి 30) గువాహటిలోని బర్సపరా స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది. ఈ ప్రకటన వెలువడటానికి ముందు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ వీడియోను సీఎస్కే సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆ వీడియోలో ధోనీ మంచి ఫామ్‌లో భారీ షాట్లు ఆడుతూకనిపించాడు. దీంతో ధోనీ అభిమానులు ఈ సీజన్ లో ధోనీ అదరగొడతారని బోలెడంత ఆనందపడ్డారు. అయితే అంతలోనే ధోనీ గాయంతో టోర్నీలో తొలి రెండు వారాలూ ఆడే అవకాశాలు లేవన్న ప్రకటన వెలువడటం అభిమానులకు షాక్ ఇచ్చింది.


.webp)
.webp)


