Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...యువత ఆకాంక్షలను గౌరవిస్తున్నా.. అందుకే రాజీనామా ధర్మేంద్ర భావోద్వేగం.!
posted on: Jul 25, 2026 2:57PM
.webp)
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పత్రం ప్రధాన మంత్రికి పంపించిన అనంతరం దేశ యువతను ఉద్దేశించి భావోద్వేగ లేఖ విడుదల చేశారు. భారత ప్రజాస్వామ్య శక్తిపై తనకు అత్యంత విశ్వాసం ఉందని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. యువత ఆకాంక్షలను కలలను తాను గౌరవిస్తానని తెలిపారు. దేశ భవిష్యత్తుకు మాత్రమే కాదు యువత ఆకాంక్షలను, కలలను తాను గౌరవిస్తానని చెప్పారు. దేశ భవిష్యత్తుకు మాత్రమే కాదు.. సరికొత్త భారతదేశానికి వారసులు యువతేనని పేర్కొన్నారు. 10 రోజులుగా జరిగిన సంఘటనలతో తీవ్రంగా బాధపడ్డానని, అందుకే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశానని వివరించారు.
తనకు అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. గత కొన్ని రోజులుగా జరిగిన పరిణామాలు తనను వ్యక్తిగతంగా బాధించాయని, అయితే ఇది తన వ్యక్తిగత పరువు లేదా రాజకీయ భవిష్యత్తు కు సంబంధించిన విషయం కాదని స్పష్టం చేశారు. దేశ యువత గందరగోళానికి గురికాకూడదనే ఉద్దేశం తో, దేశ ఐక్యతను కాపాడేందుకు, ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా చట్టపరమైన చిక్కుల్లో పడకుండా ఉండేందుకు, విద్యార్థులు తమ సమయాన్ని చదువుపై, కెరీర్ నిర్మాణంపై వెచ్చించేలా చేయాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన రాజీనామా సమర్పించినట్లు వెల్లడించారు.
చివరగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అందించిన మార్గదర్శక త్వానికి, నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, తన సహచర మంత్రులు, అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. దేశ సేవే తన జీవితంలో అత్యున్నత ధ్యేయమని, శ్రీ జగన్నాథ స్వామి ఆశీస్సు లతో భవిష్యత్తులో కూడా మాతృభూమి, ఒడిశా ప్రజలు, దేశ యువత కోసం తన సేవలు కొనసా గిస్తానని ధర్మేంద్ర ప్రధాన్ తన లేఖను ముగించారు.
Dharmendra Pradhan Resignation, NEET Paper Leak Issue, Union Education Minister, National News Telugu,CJP Protests, PM MODI


.webp)
.webp)


