Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో సూత్రధారి ధర్మారెడ్డి.. తేల్చి చెప్పిన కమిషన్ నివేదిక
posted on: May 2, 2026 4:25PM
.webp)
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం కేసుకు సంబంధంచిన ఏకసభ్య కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందింది. ఈ కమిషన్ నివేదిక తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీనెయ్యి వ్యవహారంలో అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డే సూత్రధారి అని తేల్చింది. ఆయనతోపాటు అప్పటి మరో అధికారి సింఘాల్, ఆర్థిక సలహాదారుడు, చీఫ్ అకౌంటింగ్ ఆఫీసర్ బాలాజీ, ప్రొక్యుమెంటర్ ఆఫీసర్లు జగదీశ్వర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, నెయ్యి నిపుణుడు సురేంద్రనాథ్, డైరీ నిపుణుడు విజయ భాస్కర్ రెడ్డి ప్రధాన పాత్రధారులని ఏకసభ్య కమిషన్ నివేదిక పేర్కొంది.
లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో సూత్రధారిగా ఏకసభ్య కమిషన్ తేల్చిన ఈవో ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా ధర్మారెడ్డి టీటీడీ ఈవోగా ఉండేవారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనను డిప్యూటేషన్ పై తెచ్చుకునిమరీ టీటీడీ ఈవోగా నియమించుకున్నారు. ఇప్పుడు అదే అధికారి టిటిడి లడ్డు కల్తీ వ్యవహారంలో అడ్డంగా బుక్కయ్యారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు, పర్యవేక్షణ లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం.. వంటి కారణాలతోనే తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఏకసభ్య కమిషన్ నిర్థారించింది.
2019 జూన్ లో అధికారంలోకి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత నెల రోజుల వ్యవధిలోనే అంటే జూలైలో నే ధర్మారెడ్డి టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు చేపట్టారు. 2022 మే వరకు అదే హోదాలో కొనసాగారు. ఆ తరువాత నుంచీ టీటీడీ ఈవోగా కొనసాగారు. ధర్మారెడ్డి ఈవోగా బాధ్యతలు తీసుకున్నతరువాత.. నెయ్యి సరఫరాకు సంబంధించి కొన్ని రకాల నిబంధనలు సడలించారు. నెయ్యి సరఫరాదారుల అర్హతలు, విశ్వసనీయత, అనుభవం, సమర్థత, నాణ్యత హామీలు నిలబెట్టుకోవడం, పర్యవేక్షణ, తనిఖీలు వంటి వాటిని గాలికి వదిలేశారు. ఫలితంగానే కల్తీ అయిన నెయ్యి టీటీడీలో ప్రవేశించిందని విచారణలో ఏకసభ్య కమిషన్ తేల్చింది. అంతే కాకుండా టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి పాలక మండలికి నెయ్యి సేకరణలో నిబంధనలను సడలించినవిషయాన్ని తెలియజేయలేదని కూడా కమిషన్ తన నివేదికలో పేర్కొంది. ఇప్పుడీ కమిషన్ నివేదికపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.


.webp)
.webp)


