పోలీస్ సిబ్బందికి డీజీపీ శివధర్ రెడ్డి కీలక సందేశం

 

రాష్ట్ర పోలీస్  సిబ్బందికి తెలంగాణ డీజీపీ  శివధర్ రెడ్డి  లేఖ రాశారు. ప్రజల భద్రత, పోలీస్ వ్యవస్థ నైతికత, సిబ్బంది సంక్షేమం గురించి స్పష్టమైన దిశానిర్దేశాలు అందించారు. డీజీపీ తన లేఖలో పేర్కొంటూ ఫెయిర్ అండ్ ఫ్రెండ్లీ, ప్రొఫెషనల్ పోలీసింగ్ నా ఫిలాసఫీ  అని అన్నారు. ప్రజల భద్రత మన ప్రధాన బాధ్యత అని గుర్తు చేశారు. పోలీస్ సిబ్బంది సంక్షేమం తన వ్యక్తిగత ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. 


మనం చేపట్టే ప్రతి దర్యాప్తు ప్రజా సంక్షేమ పట్ల మన సునితత్వం మరియు నిబద్ధ తను ప్రతిబింబిం చాలి. మన లక్ష్యం చట్టాన్ని అమలు చేయడం మాత్రమే కాదు. ప్రజలు గౌరవించే విధంగా చేసుకోవాలి. ప్రజా విశ్వాసమే పోలీసింగ్ యొక్క నిజమైన కొల మానం... ప్రజలతో సౌఖ్యంగా వ్యవహ రిస్తూ విధి నిర్వ హణ చేయాలి. ప్రతి పోలీస్ అధి కారి మరియు వారి కుటుంబం యొక్క సంక్షేమం వ్యక్తి గత ప్రాధాన్యత‌.. క్రమశిక్షణ సమగ్రత మరియు జవాబు దారితనం మన బలానికి మూల స్తంభాలుగా ఉంటాయి. నేరా లను నిరోధిం చడం... వివాదా లను పరిష్క రించడం.... భాగ స్వామ్య బాధ్యత యొక్క భావాన్ని తెలుసు కోవడం.... మనకు ఉండాల్సిన ముఖ్య లక్షణాలు...


అలాగే, పోలీస్ స్టేషన్లలో సివిల్ వివాదాలకు తావు ఇవ్వరాదని, అటు వంటి వ్యవహారాలు పూర్తిగా సివిల్ కోర్టుల పరిధిలోని వని డీజీపీ పేర్కొన్నారు. “పోలీస్ స్టేషన్‌లను సివిల్ పంచాయితీ అడ్డాగా మార్చితే కఠిన చర్యలు తీసుకుంటామని" హెచ్చరించారు. సమాజంలో శాంతిని కాపాడు కోవడంలో ప్రజల సహకారం తీసు కుంటూ ముందుకు వెళ్లాలని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. యూనిఫార్మ్ ధరించే వారిలో అవినీతి చోటు చేసుకోవడం అసహ్యకరమని చెప్పారు. “యూనిఫార్మ్, కరప్షన్ ఒకే చోట ఉండవు. ఒక్కరైనా లంచం తీసుకుంటే మొత్తం పోలీస్ శాఖ కే చెడ్డపేరు వస్తుంది. అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని" స్పష్టం చేశారు. 

మన ప్రవర్తన యూనిఫామ్ కు గౌరవాన్ని మరియు ప్రభుత్వానికి గర్వాన్ని అలాగే సమాజానికి శాంతిని తెస్తుంది. ప్రతి అధికారికి నాదొక సందేశం... మీ యూనిఫామ్ ను గర్వంగా మరియు వినయంగా ధరించండి..ధైర్యంగా, మర్యాదగా కరుణతో విధి నిర్వ హణలో ప్రొఫెషనల్ గా ఉండండి. అలాగే పోలీసింగ్‌లో టెక్నాలజీ వినియో గాన్ని పెంచాలని సూచిస్తూ, “బేసిక్ పోలీసింగ్‌తో పాటు ఆధునిక సాంకేతిక తను ఉపయోగిం చాలని డీజీపీ పేర్కొన్నారు.

చివరిగా, ప్రజా సేవను ముఖ్యంగా గుర్తుచేస్తూ —మీరు నమోదు చేసే ప్రతి ఎఫ్ ఐ ఆర్.... మీరు స్పందించే ప్రతి కాల్... మీరు దర్యాప్తు చేసే ప్రతి కేసు... ఎంతో న్యాయబద్ధంగా, అత్యంత ప్రమాణా లను ప్రతిబింబించే విధంగా కేసును చేదించండి...మీ మీద ప్రజలకు నమ్మకం కలగాలి. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కితే న్యాయం జరుగుతుందని ప్రజలు నమ్మాలి. మనల్ని గౌరవిం చాలి.  “పేదవారు కష్టంలో ఉన్నప్పుడు పోలీస్ ఉన్నాడని గుర్తు చేయండి. ఆపదలో ఆదుకున్న వారిని ప్రజలు ఎప్ప టికీ మరిచిపోరు” అని సిబ్బందిని ఉద్బోధించారు. ఈ లేఖతో రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ సిబ్బందికి ప్రజాభిముఖత, నైతికత, సేవా ధోరణి పై స్పష్టమైన దిశానిర్దేశం లభించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu