తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు

posted on: Apr 9, 2025 9:45AM

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం (ఏప్రిల్ 9) శ్రీవారి దర్శనం కోసం భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి చూడాల్సిన అవసరం లేకుండా నేరుగా క్యూలైన్ లో అనుమతిస్తున్నారు. ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది.

మంగళవారం (ఏప్రిల్8) శ్రీవారిని మొత్తం 65 వేల 201 మంది దర్శించుకున్నారు. వారిలో 21 వేల 50 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 93 లక్షల రూపాయలు వచ్చింది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...