తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠద్వార దర్శనాలు

తిరుమలలో శనివారం (జనవరి 18) 9వ రోజు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. గత ఎనిమిది రోజులలో తిరుమలేశుని వైకుంఠ ద్వారం ద్వారా మొత్తం 5లక్షల 36 వేల 277 మంది దర్శించుకున్నారు. ఇలా ఉండగా ఆదివారం(జనవరి 19)తో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియనున్నాయి.

శుక్రవారం(జనవరి 17) శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 15లక్షల రూపాయలు వచ్చింది. ఇక శనివారం (జనవరి 18) టికెట్లు ఉన్న భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా, టోకెన్లు పొందిన భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది.