తిరుమలలో స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ

posted on: Oct 28, 2025 9:20AM

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిట లాడుతుంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి కూడా భక్తులు తిరుమలేశుని దర్శనం కోసం పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. అటువంటి తిరుమల దివ్వక్షేత్రంలో మంగళవారం (అక్టోబర్ 28) భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో  నాలుగు కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.  

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక సోమవారం (అక్టోబర్ 27) శ్రీవారిని  మొత్తం 70 వేల 842 మంది దర్శించుకున్నారు. వారిలో  పాతికవేల 125 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 47 లక్షల రూపాయలు వచ్చింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...