తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

posted on: Oct 26, 2025 8:59AM

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల నిత్యం భక్తులతో కిటకిట లాడు తుంటుంది. తిరుమలేశుని దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తుంటారు.ఆదివారం (అక్టోబర్ 26) తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం కాంప్లెక్స్ లో 21 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. 

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శనివారం (అక్టోబర్ 25) శ్రీవారిని మొత్తం82 వేల  10  మంది దర్శించుకున్నారు. వారిలో 29,634 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 58 లక్షల రూపాయలు వచ్చింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...