Latest News
తరుమల శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం
posted on: Apr 28, 2025 9:08AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. సోమవారం (ఏప్రిల్ 28) శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా క్యూలైన్ లోనే అనుమతిస్తున్నారు.
ఇక టోకెన్లు లేని శ్రీవారి భక్తులకు స్వామి వారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. ఇక ఆదివారం శ్రీవా రిని మొత్తం78వేల 177 మంది దర్శించుకున్నారు. వారిలో23వేల 694మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 52 లక్షల రూపాయలు వచ్చింది.


.webp)
.webp)


