నెహ్రూ లైఫే ఒక థ్రిల్లర్‌ సినిమా... అందుకే కాసుల వర్షం

posted on: Apr 17, 2017 6:06PM

స్టూడెంట్‌ యూనియన్‌ గొడవలు మొదలు, రౌడీయిజం, గ్రూప్‌ వార్‌, కుల పోరు, హత్యలు, ఫ్యాక్షన్‌ పొలిటికల్‌ వార్‌... ఇలా ఒక సినిమాకి కావాల్సిన హంగులన్నీ దేవినేని నెహ్రూ జీవితంలో ఉన్నాయి. అందుకే రాంగోపాల్‌వర్మ మొదటి సినిమా శివ నుంచి లేటెస్ట్‌ సినిమా వంగవీటి వరకూ ఆయనే కథా వస్తువు. నెహ్రూ రియల్‌ లైఫ్‌లో అంత డెప్త్‌, సినిమాటిక్‌ లైఫ్‌, అనేక ఆసక్తికర మలుపులు ఉన్నాయి, అందుకే నెహ్రూ నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. 

 

బెజవాడ పాలిటిక్స్‌కు క్రేజ్ ఏర్పడటంలో నెహ్రూ పాత్ర కీలకమైంది. ఎవర్నీ లెక్కచేయని తనం, గుండెధైర్యం, ఆత్మవిశ్వాసం కూడిన పొగరు... ఇవన్నీ దేవినేని నెహ్రూని హీరోని చేశాయి. అందుకే ఎన్నో సినిమాలకు నెహ్రూ కథా వస్తువుగా మారాడు. శివ, అలజడి, బెజవాడ, వంగవీటి సినిమాలన్నీ నెహ్రూ జీవితంలో నుంచి పుట్టుకొచ్చిన కథలే. అంతేకాదు బెజవాడ రాజకీయం, అక్కడి సామాజిక సమీకరణాలే పలు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టేలా చేశాయ్‌.

 

అసలు రౌడీయిజానికి పుట్టిల్లు బెజవాడ అంటారు. ఆ రౌడీయిజానికి పొలిటికల్‌ పవర్‌ తోడవడంతో బెజవాడ క్రైమ్‌ గురించి ప్రజలు కథకథలుగా చెప్పుకుంటారు. ముఖ్యంగా వంగవీటి-దేవినేని కుటుంబాల మధ్య సాగిన ఆధిపత్య పోరు, కొన్నాళ్లకు కుల పోరుగా మారడం, ఆ తర్వాత వాటికి రాజకీయాలు తోడవడంతో దశాబ్దన్నర క్రితం బెజవాడ అట్టుడుకిపోయింది. ఇవన్నీ దగ్గర్నుంచి చూసిన రాంగోపాల్‌వర్మ... బెజవాడ బేస్‌ మీద అనేక సినిమాలు హిట్ కొట్టారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...