Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చైనాలో వరద బీభత్సం.!
posted on: Jul 16, 2026 9:52AM

భారీ వర్షాలు, వరదలతో డ్రాగన్ దేశం చిగురుటాకులా వణికిపోతోంది. చైనాలోని పలు ప్రాంతాల్లో ప్రకృతి బీభత్సం సృష్టిస్తోంది. కుండపోత వర్షాలు, భారీ వరదలలో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. గ్వాంగ్సీ జువాంగ్ అటానమస్ రీజియన్‌లో కురిసిన రి భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలు జలప్రళయాన్ని తలపించాయి. ఈ వరద బీభత్సానికి 39 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 9 మంది గల్లంతయ్యారు. నానింగ్‌లో ఒక ప్రధాన రిజర్వాయర్ కట్ట ఒక్కసారిగా తెగిపోవడంతో వరద ఉధృతి అనూహ్యంగా పెరిగిపోయింది. రిజర్వాయర్ నీరు ఊళ్ళపైకి దూసుకురావడంతో ప్రాణనష్టం, ఆస్తి నష్టం భారీగా పెరిగింది.
ఇక ఈశాన్య చైనాలోని జిలిన్ ప్రావిన్సులోనూ వరద బీభత్సం సృష్టించింది. బావి తుపాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తుండటంతో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నదులు ఉప్పొంగడం, కొండచరియలు విరిగిపడటం, చిన్న మరియు మధ్యస్థ రిజర్వాయర్లకు ప్రమాదం పొంచి ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
వాయవ్య చైనాలోని షాన్సీ, శాన్జీ ప్రావిన్సులలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే శుక్రవారంవరకూ అంటూ జులై 17 వరకూ ఈ ప్రాంతాలలో కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ భారీ వర్షాల కారణంగా ఎల్లో నదితో పాటు దాని ఉపనదులైన వెయ్, ఫెన్, ఖిన్ నదులలో నీటిమట్టాలు ప్రమాదకరంగా పెరిగే అవకాశం ఉందని జలవనరుల మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది.
Devastating floods in China, guangxi region heavy rains, typhoon bavi china, jilin province flood alert, china flood death toll






