Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...దేవాన్ష్ డిజిటల్ ఎంట్రీ.. కొడుకు పాడ్‌కాస్ట్ టీజర్‌లో తండ్రి లోకేష్
posted on: May 18, 2026 10:43AM

రాజకీయ కుటుంబాల నుంచి వచ్చే తదుపరి తరం సాధారణంగా ప్రత్యక్ష రాజకీయ రంగ ప్రవేశం లేదా ప్రజాసేవ వైపు మొగ్గు చూపడం సహజం. అయితే నారా కుటుంబానికి చెందిన మూడో తరం వారసుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి మనవడు, మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ మాత్రం సరికొత్త పంథాను ఎంచుకున్నారు. చిన్న వయసులోనే జ్ఞానాన్ని పంచే డిజిటల్ వేదిక ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు.
నారా దేవాన్ష్ తాజాగా డైనో డీట్స్ పేరుతో ఒక సరికొత్త యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించారు. సాధారణంగా సెలబ్రిటీల పిల్లలు ఎంచుకునే వినోదాత్మక అంశాలకు భిన్నంగా.. నారా దేవాన్ష్ విజ్ఞాన సమాచారానికి ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. ఈ వేదిక ద్వారా డైనోసార్లు, శిలాజాల చరిత్ర, అలాగే పురాతన ప్రపంచానికి సంబంధించిన ఆసక్తికరమైన విజ్ణాన విషయాలను పంచుకోనున్నారు.
ఈ యూట్యూబ్ ఛానల్‌కు సంబంధించిన సరికొత్త ప్రమోషనల్ వీడియో అంటే టీజర్ సామాజిక మాధ్యమాల్లో తెగ పాపులర్ అయ్యింది. ఇందులో నారా దేవాన్ష్ తన తండ్రి మంత్రి నారా లోకేష్ ను ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ తరహాలో ప్రవేశపెట్టారు. ఈ టీజర్ లో తండ్రి, కొడుకుల మధ్య సాగిన సంభాషణ నెటిజనులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. విజ్ఞానాన్ని వినోదంతో జోడించి సరికొత్తగా అందించాలన్న తపన ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రస్తుత తరం చిన్నారులు, యువత తమ విలువైన సమయాన్ని ఎక్కువగా మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా వేదికలపై వృథా చేస్తున్నారనే విమర్శలు ఉన్న నేపథ్యంలో అదే డిజిటల్ మాధ్యమాలను సమాచార విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఏ విధంగా ఉపయోగించవచ్చో నిరూపించేందుకు దేవాన్ష్ ప్రయత్నిస్తున్నారు. చరిత్ర, సైన్స్ వంటి అంశాలను నేటి తరం పిల్లలకు సులువుగా అర్థమయ్యే రీతిలో పాడ్‌కాస్ట్‌ల రూపంలో అందించనున్నారు.
గతంలోనే చెస్ క్రీడలో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి ప్రపంచ రికార్డు సృష్టించిన నారా దేవాన్ష్.. ఇప్పుడు డిజిటల్ కంటెంట్ క్రియేటర్ రూపంలో మరో కొత్త రంగాన్ని ఎంచుకోవడం విశేషం. పిల్లల్లో ఉండే సృజనాత్మకతను సరైన రీతిలో ప్రోత్సహిస్తే వారు ఎంతటి అద్భుతాలు సాధించగలరో నిరూపించడానికి దేశాన్ష్ ప్రయత్నం ఎంతగానో దోహదపడుతుంది. కుమారుడి డిజిటల్ ప్రయాణంలో తండ్రి నారా లోకేష్ సైతం మద్దతుగా నిలవడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.


.webp)
.webp)


