నాడు కోట్లకు అధిపతి..నేడు రూ.20 జీతం
posted on: Sep 20, 2017 2:30PM
.jpg)
నెల క్రితం వరకు కోట్లాది మంది ఆరాధించే గురువు..సన్యాసులు, బాబాలు ఇలా కూడా ఉంటారా అనిపించేలా రంగు రంగుల బట్టలు..రాజభోగాలు..విలాసవంతమైన జీవితం..ఎక్కడకు వెళ్లినా వెంట మందీ మార్బలం ఇదీ డేరా సచ్ఛా సౌధ అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ జీవితం..కానీ తన ఆశ్రమంలో ఉన్న ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో దోషిగా తేలడంతో అతని జీవితం తలక్రిందులైంది.
న్యాయస్థానం డేరాకు 20 ఏళ్ల జైలు శిక్షను విధించడంతో ప్రస్తుతం రోహ్‌తక్ జైలులో ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. మరి అంతటి రాజభోగాన్ని అనుభవించిన వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..? అందరి ఖైదీల మాదిరిగానే డేరా బాబాకు సైతం జైలు అధికారులు పనులు అప్పగించారు..అదేంటో తెలుసా రోజూ తోట పని చేసి కూరగాయలను పెంచే పని..ఇందుకు గాను గుర్మీత్‌కు రోజుకు రూ.20 వేతనంగా చెల్లిస్తున్నారు. టీవీ, వార్తా పత్రికలను సైతం అతడికి అందుబాటులో ఉంచడం లేదు. భద్రతా కారణాల దృష్ట్యా కనీసం ఫోన్ కాల్స్ చేసుకొనేందుకు సైతం గుర్మీత్‌ను అంగీకరించడం లేదు.



.jpg)



.webp)


