హనీప్రీత్ రాజస్థాన్‌లో ఉందట..పోలీసుల గాలింపు

posted on: Sep 21, 2017 5:59PM

అత్యాచారం కేసులో దోషిగా తేలిన తన తండ్రిని తప్పించేందుకు కుట్ర చేసిందన్న అభియోగంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్‌ కోసం హర్యానా పోలీసులు, సైన్యం తీవ్ర స్థాయిలో గాలిస్తున్నారు. ఢిల్లీలో ఉందని ఒకసారి కాదు నేపాల్ సరిహద్దుల్లో సంచరిస్తున్నట్లు మరోసారి వార్తలు వచ్చాయి. కానీ వాటిలో ఏ ఒక్క దానిలో నిజం లేదని తేలిపోయింది. ఈ ఉదయం కూడా హనీప్రీత్‌ను అరెస్ట్ చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చినప్పటికీ పట్టుబడిన వ్యక్తి డేరా కూతురు కాదని తేలింది. తాజాగా ఇప్పుడు రాజస్థాన్‌లో ఉన్నట్లు గుర్తించాయి నిఘా వర్గాలు. డేరా బాబా స్వగ్రామమైన గురుసర్మోడియాలో ఆమె ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలోకి భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించి, సోదాలు నిర్వహిస్తున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...