Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ మృతి
posted on: Apr 7, 2025 3:42PM
.webp)
అన్నమయ్య జిల్లాలో సోమవారం (ఏప్రిల్ 7) జరనిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డెప్యుటీ కలెక్టర్ మరణించారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లిలోని యర్రగుంట్ల వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో హెచ్ఎన్ఎస్ పీలేరు యూనిట్-2 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి సంఘటనా స్థలంలోనే మరణించారు. మరో నాలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. రాయచోటి కలెక్టరేట్‌లో గ్రీవెన్స్‌కు వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. క్షతగాత్రులను కలెక్టర్ శ్రీధర్ పరామర్శించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






