Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అంగరంగ వైభవంగా డిప్యూటీ సీఎం భట్టి కుమారుడి పెళ్లి
posted on: Mar 5, 2026 4:23PM

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పెద్ద కుమారుడు సూర్య విక్రమాదిత్య మల్లు వివాహ వేడుక శంషాబాద్ జీఎంఆర్ ఎరీనాలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు గురువారం ఉదయం నుంచి ప్రారంభమైన ఈ వివాహ వేడుకకు దేశ, రాష్ట్ర రాజకీయ ప్రముఖులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకలో రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, మాజీ కేంద్రమంత్రి పీ.చిదంబరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రతిపక్షానికి చెందిన నాయకుల్లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యే పాడి పెడి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి హర్యానా గవర్నర్ బండారు దత్తా త్రేయ కూడా ఈ వివాహ వేడుకకు విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించారు.
.webp)
అలాగే సినీ రంగం నుంచి మెగాస్టార్ చిరంజీవి, నటుడు అక్కినేని నాగార్జున, హీరో శ్రీకాంత్ ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి, హీరో గోపీచంద్ తదితరులు హాజరై వేడుకలో సందడి చేశారు. రాష్ట్రం నలుమూ లల నుంచి తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులతో పెళ్లి వేదిక కిటకిటలాడింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన హోదాను పక్కనపెట్టి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అతిథులతో కలిసి ఫోటోలు దిగుతూ, వారి కుశల ప్రశ్నలు అడుగుతూ అందరితో మమేకమయ్యారు. ఇంకా పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు మరియు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల రాకతో జీఎంఆర్ ఎరీనా పరిసరాలు కోలాహలంగా మారాయి. ఈ వివాహ వేడుక తెలంగాణ రాజకీయ, సామాజిక వర్గాల సమాగమంగా నిలిచింది.
.webp)






