Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అంబులెన్స్ లో ప్రసవం
posted on: Apr 8, 2026 2:25PM
.webp)
జనన, మరణాలు మన చేతిలో లేవు. కానీ కొన్ని సందర్భాల్లో 108 సిబ్బంది సమయస్ఫూర్తి, ధైర్యంతో ప్రాణం పోస్తారు. అంబులెన్సులోనే సుఖ ప్రసవాలు జరిగేలా చూస్తారు. అటువంటి సంఘటనే ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఓ గర్భిణీని అంబులెన్స్ లో తరలిస్తున్న సమయంలో మార్గమధ్యంలో పురిటి నొప్పులు వచ్చాయి.
ప్రసవ వేదనతో బాధపడుతున్న ఆ గర్భిణికి 108 సిబ్బంది సమయస్ఫూర్తితో అంబులెన్స్ లోనే కాన్పు చేసి తల్లి బిడ్డలను సురక్షితంగా కాపాడారు. ఈ సంఘటన రాయచోటిలో జరిగింది. బుధవారం తెల్లవారుజామున ఓ గర్భిణీ ని మెరుగైన చికిత్స కోసం రాయచోటి ఏరియా హాస్పిటల్ నుండి కడప రిమ్స్ హాస్పిటల్ కి 108 అంబులెన్స్ లో తీసుకు వెళ్తున్న సమయంలో ఆమె కు నొప్పులు అధికమ య్యాయి. పరిస్థితిని అర్ధం చేసుకున్న అంబులెన్స్ సిబ్బంది ఈఆర్సిపి డాక్టర్ సింధుకు ఫోన్ చేసి విషయం వివరించారు.
దీంతో డాక్టర్ సింధు సలహా మేరకు అంబులెన్స్ సిబ్బంది జయరామ్ అంబు లెన్స్ లోనే గర్భిణీకి ప్రసవం జరి పారు. ఆ గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ, తల్లి ఇద్దరు క్షేమంగా ఉన్నారు. అనంతరం ఆ మహిళకు ఐవి ఫ్లూయిడ్స్ అందిస్తూ శిశువుకు అవసరమైన ప్రాథమిక సంరక్షణ చేపడుతూ... తల్లి ,బిడ్డలను మెరుగైన చికిత్స నిమిత్తం కడప రిమ్స్ హాస్పిటల్ కి సురక్షితంగా తరలించారు.
అయితే అప్పటికే అంబు లెన్స్ లో ప్రసవించిన మహి ళను చూసి కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. అత్యవసర సమయంలో సమయస్ఫూర్తితో వ్యవ హరించి ప్రసవం చేసిన 108 సిబ్బందిని అభినందించారు.


.webp)



