Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇకపై లోక్ సభలో 850 స్థానాలు
posted on: Apr 14, 2026 7:03PM
.webp)
దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లులకు రంగం సిద్దమైంది. ఈ నెల 16 రెండు బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. దానిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఎంపీలకు సమాచారం ఇచ్చి, బిల్లు ప్రతులను వారికి పంపింది. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన బిల్లు ప్రతిపాదనల ప్రకారం రాష్ట్రాల్లో 815 వరకు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 35 వరకు లోక్‌సభ స్థానాలు పెరగనున్నాయి. అంటే లోక్‌సభ స్థానాలు 543 నుంచి 850కి పెరుగుతాయని తెలుస్తోంది.
లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి, చకచకా సీట్ల పెంపు కార్యక్రమం పూర్తి చేసి 2029 ఎన్నికల్లో అమలు చేయాలని చూస్తోంది.సీట్ల పెంపుతో దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లు కూడా పెరుగుతాయని సమాచారం. జనగణన తర్వాత అందలో వచ్చిన లెక్కల ఆధారంగా సీట్ల పెంపునకు అనుమతిస్తే ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య తేడా వచ్చే అవకాశముందని దక్షిణాది రాష్ట్రాలు ముందు నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దాంతో అన్ని రాష్ట్రాల్లో సగటున లోక్‌సభ, అసెంబ్లీ సీట్లు 50 శాతం పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీని వల్ల అన్ని రాష్ట్రాలకూ ఇప్పుడున్న రాజకీయ ప్రాతినిధ్యం యథాతధంగా కొనసాగే అవకాశం ఉంటుందంటున్నారు.






