ఢిల్లీ లాల్ కిల్లా మెట్రో స్టేషన్ నిరవధిక మూసివేత

posted on: Nov 13, 2025 12:08PM

హస్తినలో సోమవారం కారు బాంబు పేలుడు ఘటన తర్వాత  మూతపడిన లాల్ కిల్లా మెట్రో స్టేషన్ ఇంకా తెరుచుకోలేదు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ మెట్రో స్టేషన్ ను నిరవధికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఢిల్లీలోని అన్ని రైల్వే స్టేషన్లూ యథావిధిగా పని చేస్తున్నాయి.

అయితే లాల్ కిల్లా మెట్రో స్టేషన్ ను మాత్రం తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకూ మూసివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తన సోషల్ మీడియా అక్కౌంట్ లో పోస్టు చేసింది. సోమవారం జరిగిన పేలుడు ఘటనలో 13 మంది మరణించిన సంగతి తెలిసిందే.  

google-ad-img
    Related Sigment News
    • Loading...