ఢిల్లీలో భారీ పేలుడు...10 మంది మృతి
posted on Nov 10, 2025 6:50PM

ఢిల్లీలో ఎర్రకోట వద్ద భారీ పేలుడు సంభవించింది. మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర పార్కింగ్ చేసిన కారులో బ్లాస్ట్ జరిగింది. ఈ పేలుడు ధాటికి ఐదు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సమీపంలోని షాపుల తలుపులు, కిటికీలు ఎగిరిపడ్డాయి. ముగ్గురికి గాయాలైనట్లు సమాచారం. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది.
ఏడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇది ఉగ్రవాద చర్యనా? లేక ప్రమాదవశాత్తు జరిగిందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఈ ఘటనలో 10మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి మృతదేహం ఛిద్రమై గుర్తు పట్టని స్థితిలో పడి ఉంది. పలువురికి గాయాలయ్యాయి. జాతీయ దర్యాప్తు సంస్థ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ బృందాలు చేరుకున్నాయి. పోలీసులు సమీపంలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.