Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జయభేరి.. రాజస్థాన్ రాయల్స్‌పై ఘన విజయం
posted on: May 2, 2026 8:38AM

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమైన ప్రదర్శనతో చరిత్ర సృష్టించింది. జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో శుక్రవారం (మే 1) జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఆర్ఆర్ అసాధారణ పోరాట పటిమను కనబరిచింది. ఏకంగా 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి, 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించడమే కాకుండా, ఫ్రాంచైజీ చరిత్రలోనే అత్యధిక ఛేదన చేసి రికార్డు సృష్టించింది.
రాజస్థాన్ నిర్దేశించిన భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. లంక ఆటగాడు పాతుమ్ నిస్సంక ఆరంభం నుంచే రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న నిస్సంక పవర్‌ప్లేలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి కెప్టెన్ కేఎల్ రాహుల్ చక్కని సహకారం అందించారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు కేవలం 9.3 ఓవర్లలోనే 110 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయానికి బలమైన పునాది వేశారు.
నిస్సంక 62 పరుగులు చేసి నిష్క్రమించినా ఢిల్లీ ఎక్కడా తడబడలేదు. వన్‌డౌన్‌లో వచ్చిన నితీశ్ రాణా కేవలం 16 బంతుల్లోనే 33 పరుగులతో మెరుపులు మెరిపించాడు. రాహుల్ తన అనుభవాన్ని జోడించి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించగా, చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ 18, అశుతోష్ శర్మ పాతిక పరుగులతో మ్యాచ్ ను ముగించారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ మరో 5 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ రియాన్ పరాగ్ 50 బంతుల్లో 90 పరుగులతో వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో డొనోవన్ ఫెరీరా 47 నాటౌట్ విధ్వంసకర బ్యాటింగ్‌తో స్కోరును 200 దాటించాడు. అయితే.. ఢిల్లీ బౌలర్ మిచెల్ స్టార్క్ (3/40) కీలక సమయాల్లో వికెట్లు తీసి రాజస్థాన్ స్కోరును కొంత మేర నియంత్రించగలిగాడు. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకోవడమే కాకుండా, ఇతర జట్లకు బలమైన హెచ్చరిక పంపింది.



.webp)


