డబ్ల్యుపీఎల్.. ఫైనల్స్ కు దూసుకెళ్లిన ఢిల్లీ క్యాపిటల్స్

posted on: Feb 4, 2026 8:02AM

మహిళల ప్రీమొయర్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ జెయింట్స్ పై ఘన విజయం సాధించింది.  డబ్ల్యుపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్స్ కు చేరడం వరుసగా ఇది నాలుగో సారి.   

ఎలిమినేటర్ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బెత్ మూనీ  62 నాటౌట్ టాప్ స్కోరర్. 35 పరుగులతో జార్జియా వేర్హామ్  కూడా బ్యాట్ తో రాణించింది. ఢిల్లీ బౌలర్లలో చిన్నెల్ హెన్రీ 3 వికెట్లు తీసింది. 

169 పరుగుల విజయంతో బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ కు ఓపెనర్లు లిజెల్ లీ , షఫాలీ వర్మ అదిరే ఆరంభాన్నిచ్చారు. పవర్ ప్లేలోనే ఈ జంట అజేయంగా 75 పరుగులు సాధించి విజయాన్ని ఖాయం చేసింది. ఇక లీ 43 పరుగులు, షపాలీ వర్మ 31 పరుగులు చేసి ఒకే ఓవర్లో ఔటయ్యారు.  ఆ తరువాత   కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్అద్భుతంగా ఆడి తన ట్రేడ్‌మార్క్ షాట్లతో గుజరాత్ జెయింట్స్ బౌలర్లను ఓ ఆటాడుకుంది. తన ట్రేడ్ మార్క్ షాట్లతో కేవలం 23 బంతుల్లోనే 41 పరుగులు సాధించింది. ఇక  లారా వోల్వార్డ్ 32 నాటౌట్ నిలకడగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చింది. ఈ గెలుపుతో ఢిల్లీ క్యాపిటల్స్ టైటిల్ పోరుకు సిద్ధమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గురువారం జరిగే  ఫైనల్స్ లో ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి.    

google-ad-img
    Related Sigment News
    • Loading...