ఢిల్లీ పేలుడు.. ప్రధాన నిందితుడి ఇల్లు పేల్చివేత
posted on Nov 14, 2025 8:43AM

ఢిల్లీ పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ నడి ఇంటిని భద్రతా దళాలు పేల్చివేశాయి. జమ్మూ కశ్మీర్ పుల్వామాలోని అతడి ఇంటిని గురువారం(నవంబర్ 13) అర్ధరాత్రి దాటిన తర్వాత భద్రతా దళాలు పేల్చివేశాయి. పేలుడు పదార్థాలు ఉపయోగించి అతడి ఇంటిని పూర్తిగా నేలమట్టం చేశాయి. ఉమర్ నబీ తన నివాసాన్ని ఉగ్ర కార్యకలాపాలకు అడ్డాగా చేసుకోవడంతో అధికారులు ఈ చర్య తీసుకున్నారు. కశ్మీర్ లోయలో ఉగ్రవాద నిర్మూలన ఆపరేషన్‌లో భాగంగానే డాక్టర్ ఉమర్ నబీ ఇంటిని కూల్చివేశామని అధికారులు చెబుతున్నారు.
అలాగే ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు సాగుతోంది. సోమవారం (నవంబర్ 10)న జరిగిన ఢిల్లీ పేలుడులో 13 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ కారు నడిపి ఆత్మాహుతి దాడికి పాల్పడింది డాక్టర్ ఉమర్ నబీయే అని దర్యాప్తు సంస్థలు నిర్థారించాయి. ఆ పేలుడులో ఉమర్ నబీ కూడా మరణించాడు.