"ఖి" లేడి టెర్రరిస్ట్ డాక్టర్‌ షాహిన్‌

 

ఢిల్లీ ఎర్రకోట వద్ద బాంబు పేలుడు కేసులో అరెస్ట్ అయిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహిళ డాక్టర్‌ షాహిన్‌ ఫోటో బయటికొచ్చింది. అధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అల్ ఫలాహ్ వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆమె ఉగ్రవాద ఆపరేషన్‌‌కు నిధులు సమకూర్చడం, ఆపరేషన్‌కు సులభతరం చేయడంలో కీలకంగా పనిచేసినట్లు గుర్తించారు. దేశంలో జైషే మహమ్మద్‌ కోసం మహిళా నియామకాలను షాహీన్ పర్యవేక్షిస్తున్నట్లు నిఘా వర్గలు తెలిపాయి. 

 ఈ జమాత్‌ ఉల్‌ మొమినాత్‌ విభాగానికి మసూద్‌ సోదరి సాదియా అజార్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఈ విభాగంలో డా.షాహిన్‌కు కీలక బాధ్యతలు అందించినట్లు తెలుస్తోంది. ఇండియాలో ఉమెన్ విభాగాలు స్థాపించి, వారి నియామకాలు చేపట్టడం వంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.డా. షాహిన్‌ షాహిద్ లఖ్‌నవూలోని  లాల్‌బాగ్‌ నివాసి. ఫరీదాబాద్‌లోని మాడ్యూల్‌పై ఆపరేషన్‌ నేపథ్యంలో ముగ్గురు వైద్యులు అదీల్‌ అహ్మద్, ముజమ్మిల్‌ షకీల్, షాహిన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ముజమ్మిల్‌తో షాహిన్‌కు దగ్గర సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయుధాలను నిల్వ చేసేందుకు అనుమానితులు ఉపయోగించిన కారు మహిళా డాక్టర్‌ పేరు మీదే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ముజమ్మిల్‌ విచారణ నేపథ్యంలో ఈ మహిళా డాక్టర్‌ విషయం తెలియగా.. అధికారులు ఆమెను కూడా అరెస్టు చేశారు. ఈ క్రమంలో విచారణ కోసం  ఆమెను శ్రీనగర్‌కు తరలించారు. ఢిల్లీ పేలుళ్ల ఘటనలో ఆత్మాహుతి దాడిగా పరిగణిస్తున్న దర్యాప్తు బృందం..  ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఫొటోను పోలీసులు తొలిసారిగా విడుదల చేశారు. ఈ భీకర పేలుడులో 12 మంది మృతి చెందగా, 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu