ఢిల్లీ పేలుడుపై అమిత్‌షాకు కీలక ప్రకటన
posted on Nov 10, 2025 9:05PM
.webp)
ఢిల్లీ పేలుడు ఘటనపై కేంద్ర హొం మంత్రి అమిత్‌షాకు కీలక ప్రకటన చేశారు. ఈ సాయంత్రం 7 గంటలకు ఎర్రకోట వద్ద సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారులో బాంబు పేలుడు సంభవించింది. దీంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి అని పేర్కొన్నారు. ఘటన జరిగిన 10 నిమిషాల్లోనే ఎన్ఏఐ, ఎన్ఎస్‌జీ బృందాలు చేరుకున్నాయని తెలిపారు.
సమీపంలో అన్ని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఉన్నతాధికారులతో ఎప్పుటికప్పుడు మాట్లాడుతున్నమని అమిత్‌షా తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నివేదిక రాగానే ప్రజల ముందు ఉంచుతామని కేంద్ర మంత్రి వెల్లడించారు. గాయాలపాలై LNJP ఆస్పత్రిలో చికిత్స బాధితులను అమిత్‌షా పరామర్శించారు. పేలుడు ఘటనల్లో మృతుల సంఖ్య 10 చేరింది, మరో 30 మందికి గాయాలయ్యాయి. ఈ పేలుడు ఈ ఘటనతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించింది.