ఢిల్లీ పేలుడుపై ప్రధాని ఆరా...అమిత్‌షాకు ఫోన్

 

ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రధాని మోదీ కేంద్ర హొం మంత్రి అమిత్‌షాకు ఫోన్ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు పేలుడు ఘటనలో ఒకరిని అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు సంస్థలు అతడిని ప్రశ్నిస్తున్నాయి. బాంబు బ్లాస్ట్‌పై ఢిల్లీ పోలీసు కమీషనర్ స్పందించారు. సీసీటీవీ ఫుటేజీలో ఆధారంగా కీలక విషయాలను కనుగొన్నట్లు వెల్లడించారు. ఫుటేజీ ఆధారంగా.. నెమ్మదిగా వెళ్తున్న కారులో పేలుడు జరిగిందని తెలిపారు. 

ఆ కారు కూడా వాహనాలు ఎక్కువగా ఉన్న చోటికి వెళ్లగానే పేలుడు జరిగినట్లుగా గుర్తించామన్నారు. ఆ కారు కావాలనే రద్దీగా ఉన్న చోటికి వెళ్లిందా ? లేక కారులో వేరే వ్యక్తులు బాంబును అమర్చారా? పేలుడు ఎలా జరిగింది? అన్న విషయాలపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరగా.. క్షతగాత్రుల సంఖ్య 30కి చేరింది. ఎన్ఏఐ, ఎన్ఎస్‌జీ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu