ఢిల్లీలో పేలుడు.... హైదరాబాద్‌లో అలర్ట్

 

ఢిల్లీలో భారీ పేలుడు జరగడంతో హైదరాబాద్‌లో సీపీ సజ్జనార్ అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్ అన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంగా పాతబస్తీలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. రద్దీ ప్రాంతాల్లో వాహన తనిఖీలు చేపట్టినట్లు  సీపీ వెల్లడించారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే డయల్ 100కు సమాచారం వెంటనే ఇవ్వాలని సీపీ సజ్జనార్ తెలిపారు. సీటిలో ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నట్టు తెలిపారు. రైల్వేస్టేషన్స్, బస్టాండ్స్‌లో పోలీసులు తనిఖీలు చేశారు.

మరోవైపు మారుతీ ఎకో కారులో పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే ఎన్ఏఐ, ఎన్ఎస్‌జీ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారులో ఉంచిన పేలుడు పదార్థాలను రిమోట్ కంట్రోల్ ద్వారా పేల్చి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం కావడంతో ఢిల్లీలోని పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లకు సెలవు ఉంది. అందువల్ల ప్రమాద తీవ్రత తక్కువగా ఉందని స్థానికులు తెలిపారు. ఎర్రకోట సమీపంలోని మెట్రో రైలు వద్ద బ్లాస్ట్  సంభవించడంతో టూరిస్ట్‌లను టార్గెట్ చేసుకున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu